Telugu Global
Andhra Pradesh

దిశ యాప్.. బంపరాఫర్

దిశ యాప్ ప్రత్యేక డ్రైవ్ కోసమని ప్రతి ప్రముఖ షాపింగ్ మాల్ దగ్గర ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటు చేశారు. కొన్ని షాపింగ్ మాల్స్ దగ్గర 15 శాతం డిస్కౌంట్ పేరుతో బంపర్ ఆఫర్ అంటు బోర్డులను ఉంచారు.

దిశ యాప్.. బంపరాఫర్
X

దిశ యాప్.. బంపరాఫర్

దిశ యాప్ డౌన్‌లోడ్‌కు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుంటోంది. మహిళలపై జరిగే వేధింపులు, అత్యాచారాలను నిరోధించటానికే ప్రధానంగా ప్రభుత్వం ఈ యాప్‌ను తీసుకొచ్చింది. మహిళల సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రత్యేకంగా దిశ పోలీసు స్టేషన్లను కూడా ఏర్పాటు చేసింది. అందుకనే దిశ చట్టాన్ని కూడా తయారు చేసింది. అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన దిశ చట్టం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది.

చట్టం ఆమోదం కోసం డ్రాఫ్ట్‌ను కేంద్రానికి పంపించి చాలా కాలమే అయినా ఎందుకనో కేంద్ర హోంశాఖ పదేపదే చట్టానికి సంబంధించి కొర్రీలు వేస్తునే ఉంది. రాష్ట్రపతి సంతకం అయితే కానీ చట్టం అమల్లోకి రాదు. అందుకనే చట్టం అమల్లోకి రాలేదు. కానీ దిశ యాప్ అయితే బాగానే పాపులర్ అయ్యింది. ఇప్పుడు పోలీసులు యాప్‌ను మరింతగా జనాల్లోకి తీసుకెళ్ళేందుకు వీలుగా ప్రత్యేక బంపరాఫర్ ప్రకటించారు. అదేమిటంటే దిశ యాప్‌ను మొబైల్ ఫోన్లలో డౌన్ లోడ్ చేస్తే షాపింగ్ మాల్స్ లో 15 శాతం అదనపు డిస్కౌంట్ వస్తుంది.

ప్రముఖ షాపింగ్ మాల్స్ తో పోలీసు శాఖ ప్రత్యేకంగా ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం వ‌స్త్రాలు కొనుగోలు చేసే ప్రతి మహిళకు అదనంగా 15 శాతం డిస్కౌంట్ దొరుకుతుంది. అంటే సేల్స్ పెంచుకునేందుకు షాపులు ప్రకటించే పండుగ ఆఫర్లకు అదనంగా ఈ బంపర్ ఆఫర్ ఉంటుంది. దసరా, దీపావళి, క్రిస్మ‌స్‌, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకుని షాపింగ్ మాల్స్ ఎలాగూ ప్రత్యేక డిస్కౌంట్లు ఇవ్వటం మామూలే. అందుకనే దీనిపైన దృష్టిపెట్టిన పోలీసు శాఖ దిశ యాప్ డౌన్‌లోడ్ పేరుతో అదనంగా 15 శాతం డిస్కౌంట్ అని ప్రకటించింది.

దిశ యాప్ ప్రత్యేక డ్రైవ్ కోసమని ప్రతి ప్రముఖ షాపింగ్ మాల్ దగ్గర ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటుచేశారు. కొన్ని షాపింగ్ మాల్స్ దగ్గర 15 శాతం డిస్కౌంట్ పేరుతో బంపర్ ఆఫర్ అంటు బోర్డులను ఉంచారు. దీనికి విపరీతమైన స్పందన కనిపిస్తోంది. ప్రతి మహిళ మొబైల్ ఫోన్లోను దిశ యాప్ ఉండాలన్నది ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. అందుకనే బంపరాఫర్ కూడా ప్రకటించింది.

First Published:  16 Nov 2023 11:03 AM IST
Next Story