బాబూ..! నువ్వు టీవీ షోలకు వెళ్లు.. మేం అసెంబ్లీకి పోతాం..
అసెంబ్లీని కూడా కాదని చంద్రబాబు, బామ్మర్ది షో కి వెెళ్లారని, కానీ జగన్ మాత్రం జనం మధ్యలో తిరుగుతున్నారని, వచ్చేసారి 175 సీట్లు తమకు గ్యారెంటీ అని అంటున్నారు అంబటి.
బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో పై అంబటి రాంబాబు భలే పంచ్ వేశారు. పనిలో పనిగా చంద్రబాబుపై కూడా సెటైర్లు వేశారు. బాలకృష్ణ-చంద్రబాబు అన్ స్టాపబుల్ షో.. కేవలం టీవీ షో మాత్రమేనని అసలు అన్ స్టాపబుల్ షో జగన్ ది అని ఇన్ డైరెక్ట్ గా రిప్లై ఇచ్చారు.
"అసెంబ్లీ"ని కాదని
బామ్మర్ది "షో"కెళ్ళిన బాబు
"జనం" లో కెళ్ళిన జగన్
అందుకే "175-unstopable"! అంటూ ట్వీట్ చేశారు అంబటి రాంబాబు.
బాబు-అసెంబ్లీ.. ర్యాగింగ్..
ఆమధ్య చంద్రబాబు అసెంబ్లీలో తనకు అవమానం జరిగిందని, తిరిగి ముఖ్యమంత్రి అయ్యాకే తాను అసెంబ్లీలో అడుగుపెడతానంటూ శపథం చేసి వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ సీన్ ని మళ్లీ గుర్తు తెస్తూ అంబటి ట్వీట్ వేశారు. అసెంబ్లీని కూడా కాదని చంద్రబాబు, బామ్మర్ది షో కి వెెళ్లారని, కానీ జగన్ మాత్రం జనం మధ్యలో తిరుగుతున్నారని, వచ్చేసారి 175 సీట్లు తమకు గ్యారెంటీ అని అంటున్నారు అంబటి.
అన్ స్టాపబుల్ ఎవరు..?
ఈ షో బాలకృష్ణదే అయినా.. బాలయ్య పరిస్థితి ప్రస్తుతం అన్ స్టాపబుల్ అని చెప్పలేం. సినిమాల్లో హిట్లు తగులుతున్నా.. రాజకీయాల్లో మాత్రం సొంత నియోజకవర్గం హిందూపురంలో ఆయనకు గడ్డుపరిస్థితి ఎదురవుతుందని అంటున్నారు. వైసీపీలో అంతర్గత కుమ్ములాట బాలయ్యకు కలిసొస్తుందనే వాదన కూడా ఉంది. ఇక చంద్రబాబు విషయానికొస్తే.. ఆయన కూడా అన్ స్టాపబుల్ అని క్లెయిమ్ చేసుకోలేరు. ముఖ్యమంత్రి సీటు తర్వాత, ముందు కుప్పం సీటు కదిలే పరిస్థితి రావడంతో ఆయన హడావిడి పడుతున్నారు. ఇక అన్ స్టాపబుల్ అనే క్రెడిట్ తమదేనంటున్నారు అంబటి రాంబాబు వంటి నేతలు. జగన్ కి ఎదురేలేదు, తిరుగే లేదు, 175 సీట్లు తమవేనంటున్నారు. ఇది అతిశయోక్తే అయినా.. టార్గెట్ 175 పెట్టుకుంటే.. రేపు పరిస్థితి కాస్త అటు ఇటు అయినా 151 కంటే సీట్లు తగ్గవు అనేది జగన్ అంచనా.