Telugu Global
Andhra Pradesh

ఏపీ బడ్జెట్‌ రూ. 3.22 లక్షల కోట్లు

రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు, ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లుగా అంచనా

ఏపీ బడ్జెట్‌ రూ. 3.22 లక్షల కోట్లు
X

ఏపీ శాసనసభలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టారు. రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను సమర్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇది. బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ. 48 వేల కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ. 40, 635 కోట్లు, రెవెన్యూ లోటు 33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లుగా అంచనా వేశారు. రాష్ట్ర రుణ సమార్థ్యం సున్నాకు చేరుకున్నది. అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలింది. సీఎం మాటల స్ఫూర్తితో బడ్జెట్‌ను రూపొందించాం. 2014-2019 మధ్య రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించిందని మంత్రి పయ్యావుల బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.

అంతకుముందు 2025-26 వార్షిక బడ్జెట్‌కు ఏపీ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ బడ్జెట్‌ పత్రాలను అందజేశారు. అనంతరం 2025-26 వార్షిక బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

బడ్జెట్‌ కేటాయింపులు ఇలా

  • నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ. 1,228 కోట్లు
  • పాఠశాల విద్యాశాఖకు రూ. 31,805 కోట్లు
  • ఉన్నత విద్యకు రూ. 2,506 కోట్లు
  • ఎస్సీల సంక్షేమానికి రూ. 20,281 కోట్లు
  • ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు
  • బీసీల సంక్షేమానికి రూ. 47,456 కోట్లు
  • అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ 5,434 కోట్లు
  • మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ. 4,332 కోట్లు
  • నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ. 1,228 కోట్లు
  • పాఠశాల విద్యాశాఖకు రూ. 31,805 కోట్లు
  • ఉన్నత విద్యకు రూ. 2,506 కోట్లు

First Published:  28 Feb 2025 10:31 AM IST
Next Story