గ్రూప్-2 మెయిన్స్ వాయిదాకు కట్టుబడి ఉన్నాం
రోస్టర్ తప్పులు సరిదిద్దాకే పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసినట్లు సీఎం వెల్లడి
BY Raju Asari22 Feb 2025 6:14 PM IST

X
Raju Asari Updated On: 22 Feb 2025 6:14 PM IST
గ్రూప్-2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు అంశాలపై సీఎం చంద్రబాబు శనివారం పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు.. గ్రూప్-2 అభ్యర్థుల్లో నెలకొన్న గందరగోళంపై సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రోస్టర్ విధానంపై అభ్యర్థులు 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అభ్యర్థుల ఆందోళన మా దృష్టికి రాగానే సాధ్యాసాధ్యాలను పరిశీలించాం. కోర్టులో మార్చి 11న విచారణ దృష్ట్యా అప్పటివరకు పరీక్షలు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాశాం. రిజర్వేషన్ రోస్టర్ సమస్య సరిదిద్దాకే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వ అభిమతమని సీఎం వివరించారు.
Next Story