విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్‌కు 14 రోజుల రిమాండ్
విశ్రాంత సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపర్చారు. అనంతరం 14 రోజుల రిమాండ్‌ను కోర్టు విధించింది.
ఏపీ సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విజయ్‌పాల్‌ను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపర్చారు. 11 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టు ముందుంచిన పోలీసులు.. విజయ్‌పాల్‌ను రిమాండ్‌కు ఇవ్వాలని కోరారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని తెలిపారు. వాస్తవాలు రాబట్టేందుకు ఇంటరాగేషన్ అవసరమని పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును టార్చర్ చేయడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు.
దీని వెనుక కుట్రదారులు ఎవరో తేలాలంటే విజయపాల్ ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో, న్యాయస్థానం విజయపాల్ కు రెండు వారాల రిమాండ్ విధించింది. విజయ్‌పాల్‌ను భారీ భద్రత మధ్య గుంటూరు కోర్టుకు తరలించారు పోలీసులు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి ఎస్పీ కార్యాలయానికి విజయ్‌పాల్‌ను తీసుకెళ్లిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.