సంతానోత్పత్తికి థైరాయిడ్ చేసే చేటు!!
ప్రస్తుతకాలంలో భార్యాభర్తలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో సంతానం కలగకపోవడం కూడా ఒకటి. కాస్త స్పష్టంగా చెప్పాలంటే పిల్లలు పుట్టకపోవడం నేటితరం భార్యాభర్తలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. పిల్లలు కలగకపోవడానికి వయసు, జన్యుపరమైన కారణాలు, అనారోగ్య సమస్యలు ఎన్నో ఉంటాయి. వాటిలో ఒకటి థైరాయిడ్ సమస్య. థైరాయిడ్ హార్మోన్ తక్కువ స్థాయిలో ఉంటే సంతానోత్పత్తి మీద ప్రభావం చూపిస్తుంది. ఇలా థైరాయిడ్ హార్మోన్ తక్కువ స్థాయిలో ఉండటాన్ని హైపోథైరాయిడిజం అని అంటారు. పిల్లలకోసం ప్రయత్నించేవారిలో ఈ సమస్య ఉన్నట్టు […]
ప్రస్తుతకాలంలో భార్యాభర్తలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో సంతానం కలగకపోవడం కూడా ఒకటి. కాస్త స్పష్టంగా చెప్పాలంటే పిల్లలు పుట్టకపోవడం నేటితరం భార్యాభర్తలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. పిల్లలు కలగకపోవడానికి వయసు, జన్యుపరమైన కారణాలు, అనారోగ్య సమస్యలు ఎన్నో ఉంటాయి. వాటిలో ఒకటి థైరాయిడ్ సమస్య. థైరాయిడ్ హార్మోన్ తక్కువ స్థాయిలో ఉంటే సంతానోత్పత్తి మీద ప్రభావం చూపిస్తుంది. ఇలా థైరాయిడ్ హార్మోన్ తక్కువ స్థాయిలో ఉండటాన్ని హైపోథైరాయిడిజం అని అంటారు. పిల్లలకోసం ప్రయత్నించేవారిలో ఈ సమస్య ఉన్నట్టు పరీక్షలలో బయటపడితే వీలైనంత తొందరగా ఈ సమస్యను అరికట్టడం ఎంతో ముఖ్యం.
లక్షణాలు!!
ఆడవాళ్ళలో హైపోథైరాయిడిజం సమస్య ఉంటే అలసట, కడుపుకు సంబంధించిన సమస్యలు, నెలసరి గందరగోళం అవ్వడం, రక్తస్రావం ఎక్కువ రోజులు జరగడం. శరీర ఉష్ణోగ్రత చాలా తక్కువ వుండటం, శరీరం చాలా బలహీనంగా ఎత్తుకుతగిన బరువు లేకుండా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి గుండె సంబంధ సమస్యలు, నరాలు దెబ్బతినడం, సంతానోత్పత్తికి ఆటంకం కలిగించడం వంటివి చేస్తాయి. కొన్ని సందర్భాలలో ఇది మరణాన్ని కలిగించే అవకాశం కూడా ఉంటుంది.
సమస్య ఎలా వస్తుంది??
◆ గర్భం దాల్చాలని అనుకునేవారిలో థైరాయిడ్ సమస్య ఉంటే శరీరంలో ఆటో ఇమ్యూనిటీ యాంటీబాడిస్ సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి.
◆ థైరాయిడ్ హార్మోన్ తక్కువ స్థాయిలో ఉంటే ప్రొజెస్టెరాన్ స్థాయిలు అస్తవ్యస్తం అవుతాయి. దీనివల్ల గర్భం వచ్చినా అది నిలవకుండా అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
◆మరీ ముఖ్యంగా పురుషులలో ఈ థైరాయిడ్ సమస్య ఉంటే గనుక వీర్యాన్ని పలుచన చేస్తుంది. దీనివల్ల అండాలతో చర్యజరపడంలో విఫలం అవుతుంది.
పరిష్కారం!!
◆ థైరాయిడ్ గ్రంధి ద్వారా ఎదురయ్యే రెండు సమస్యల్లో హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం ఉన్నాయి. ఇవి రెండూ కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి.
◆ పిల్లల కోసం ప్లానింగ్ చేసుకునేవారు ముందుగా డాక్టర్ ను సంప్రదించడం మంచిది. రక్తపరీక్ష ద్వారా నిరారించబడే థైరాయిడ్ సమస్యకు డాక్టర్ లు అన్ని రకాల హార్మోన్ మరియు శారీరక సామర్థ్య పరీక్షలు కూడా నిర్వహించి తగిన సలహాలు సూచిస్తారు.
◆ గర్భం వచ్చిన వారిలో థైరాయిడ్ స్థాయిల విషయంలో ఏదైనా గందరగోళం ఉన్నప్పుడు వైద్యుల సహాయం తీసుకోవడం వల్ల వారు సూచించే కొన్నిరకాల మందులు గర్భస్రావం కాకుండా కాపాడుతుంది.
◆ లైవోథైరాక్సిన్ తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య కారణంగా గర్భస్రావం అయ్యే అవకాశాలు తగ్గుతాయి. అయితే వైద్యుల సలహా లేనిది వాడటం మరింత ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సొంతవైద్యం పనికిరాదు.
◆ థైరాయిడ్ సమస్యను గుర్తించినా దానికి తగిన వైద్యం తీసుకోకపోతే మహిళల్లో నెలసరి సమస్యలు చాలా ప్రమాదంగా పరిణమిస్తాయి. ఇది క్రమంగా రక్తహీనతకు దారితీస్తుంది. శరీరంలో తగినంత రక్తస్థాయిలు లేకపోతే గర్భం దాల్చడం చాలా ప్రమాదం.
◆ పురుషులలో ఈ థైరాయిడ్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే క్రమంగా పిల్లలు పుట్టే సామర్థ్యము కోల్పోతారు.
సమస్యను కనుగొన్నప్పుడే వైద్యుల సలహా మేరకు మందులు వాడితే తల్లిదండ్రులవ్వాలనే కల నెరవేర్చుకోవచ్చు. లేకపోతే సమస్య కాస్తా సంతానమనే పదాన్ని జీవితం నుండి తొలగించేస్తుంది.