మూడు ఫోన్లలో ఒకే నెంబర్‌తో వాట్సప్… కొత్త ఫీచర్ తీసుకొస్తున్న మెటా
ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది ఉపయోగించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్‘. దీనికి రోజు రోజుకూ ఆదరణ పెరుగుతుండటంతో, ఎప్పటికప్పుడు యాజమాన్యం మెటా కూడా సరి కొత్త ఫీచర్లను తీసుకొని వస్తోంది. ఇప్పటి వరకు వాట్సప్ ఉపయోగించాలంటే ఒక నెంబర్‌తో ఒకే ఫోనులో మాత్రమే కుదురుతుంది. వెబ్ ఆప్షన్ ఉపయోగించి ల్యాప్‌టాప్, పీసీ, ట్యాబ్‌లలో వాట్సప్ ఉపయోగించే వీలున్నది. అయితే ఆ సమయంలో మనం ప్రైమరీగా ఉపయోగించే ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ తప్పని సరిగా ఉండాలి. కాగా, […]
ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది ఉపయోగించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్‘. దీనికి రోజు రోజుకూ ఆదరణ పెరుగుతుండటంతో, ఎప్పటికప్పుడు యాజమాన్యం మెటా కూడా సరి కొత్త ఫీచర్లను తీసుకొని వస్తోంది. ఇప్పటి వరకు వాట్సప్ ఉపయోగించాలంటే ఒక నెంబర్‌తో ఒకే ఫోనులో మాత్రమే కుదురుతుంది. వెబ్ ఆప్షన్ ఉపయోగించి ల్యాప్‌టాప్, పీసీ, ట్యాబ్‌లలో వాట్సప్ ఉపయోగించే వీలున్నది. అయితే ఆ సమయంలో మనం ప్రైమరీగా ఉపయోగించే ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ తప్పని సరిగా ఉండాలి.
కాగా, వాట్సప్ ఇప్పుడు సరికొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టనున్నది. యూజర్లు ఒకే నెంబర్‌తో మూడు ఫోన్లలో వాట్సప్ ఉపయోగించవచ్చు. ఇలా ఉపయోగించే సమయంలో ప్రైమరీ నెంబర్ ఉన్న ఫోన్‌కు ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా.. మిగిలిన డివైజ్‌లలో వాట్సప్ యాధావిధిగా పని చేస్తుంటుంది. ఈ విషయాన్ వాబీటా ఇన్ఫో ఒక రిపోర్టులో ప్రచురించింది. వాట్సప్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.22.15.1 లో ఈ మల్టీ డివైజ్ 2.0ను ప్రవేశపెట్టినట్లు తెలుస్తున్నది. ఇందులో న్యూ కంపానియన్ మోడ్‌లో వేరే డివైజ్‌లలో సేమ్ నెంబర్‌తో వాట్సప్ వాడుకోవచ్చు.
ఈ కంపానియన్ మోడ్ యూజ్ చేసి వేరే ఫోన్‌లో వాట్సప్ అకౌంట్‌ను అదే నెంబర్ సాయంతో ఓపెన్ చేయవచ్చు. ప్రైమరీ ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా.. రెండో డివైజ్‌లో వాట్సప్ పని చేస్తుంది. వాట్సప్ వెబ్/డెస్క్‌టాప్ వెర్షన్లు ఎలా పని చేస్తాయో సేమ్ అలాగే కంపానియన్ మోడ్ పని చేస్తుంది. అంటే రెండో డివైజ్‌లో వాట్సప్ ఇన్‌స్టాల్ చేస్తే, అది ఓపెన్ కావడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో వాట్సప్ మెసేజెస్ అన్నీ కాపీ అవుతాయి. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో ఉపయోగించుకోవచ్చు. త్వరలోనే మిగిలిన యూజర్లు అందరికీ కంపానియన్ మోడ్ అందుబాటులోకి వస్తుంది.
వాట్సప్ బీటాలో దీనిని విస్తృతంగా టెస్ట్ చేస్తున్నారు. మన వాట్సప్ మెసేజెస్ చోరికి గురి కాకుండా, హ్యాక్ కావడానికి తావులేకుండా అన్ని పరీక్షలు జరిపిన తర్వాతే అందరు యూజర్లకు అందుబాటులోకి రానున్నది. అయితే ఇందుకు ఎంత సమయం పడుతుందో మాత్రం ఇంకా తెలియలేదు. కంపానియన్ మోడ్ అందుబాటులోకి వస్తే మాత్రం మూడు డివైజ్‌లలో ఒకే నెంబర్‌తో వాట్సప్ ఉపయోగించే వీలు ఉంటుంది.