కోడి కత్తి కేసు: ఛీఫ్ జస్టిస్ కు లేఖ రాసిన నిందితుడి తల్లి

2019 లో విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో వైఎస్ జగన్ పై ‘కోడి కత్తి’తో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ తల్లి సావిత్రి సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. నాలుగేళ్ళుగా తన కుమారుడు శ్రీనివాస్ జైల్లోనే ఉన్నాడని, ఇప్పటి వరకు విచారణ లేకుండా, బెయిల్ లేకుండా అన్యాయం చేస్తున్నారని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. విచారణ లేకుండా నాలుగేళ్ళుగా రిమాండ్ ఖైదీగా కొనసాగించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి కేసుపై […]

Advertisement
Update:2022-07-09 07:39 IST

2019 లో విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో వైఎస్ జగన్ పై ‘కోడి కత్తి’తో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ తల్లి సావిత్రి సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు.

నాలుగేళ్ళుగా తన కుమారుడు శ్రీనివాస్ జైల్లోనే ఉన్నాడని, ఇప్పటి వరకు విచారణ లేకుండా, బెయిల్ లేకుండా అన్యాయం చేస్తున్నారని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. విచారణ లేకుండా నాలుగేళ్ళుగా రిమాండ్ ఖైదీగా కొనసాగించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తన కుమారుడి కేసుపై ఎన్ ఐ ఏ కానీ న్యాయస్థానంకానీ ఎలాంటి విచారణ జరపడం లేనందున తన కుమారుడిని తక్షణం విడుదల చేయాలని శ్రీనివాస్ తల్లి సావిత్రి ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు విజ్ఞప్తి చేశారు.

కాగా 2019 అక్టోబర్ 25న వైఎస్ జగన్ విజయనగరంలో తన పాద యాత్ర ముగించుకొని హైదరాబాద్ వెళ్ళడానికి విశాఖ ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. ఆ సమయంలో ఎయిర్ పోర్ట్ క్యాంటిన్ లో పని చేసే శ్రీనివాస్ అనే యువకుడు కోడి పందేలకు ఉపయోగించే కత్తితో జగన్ పై దాడికి పాల్పడ్డాడు. అక్కడున్న జగన్ అనుచరులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. అప్పటి నుంచి శ్రీనివాస్ జైల్లోనే ఉంటున్నాడు.

Tags:    
Advertisement