రిలేషన్స్ లో జరిగే పొరపాట్లు..!
సాధారణంగా ఏ దేశంలో అయినా స్త్రీపురుషుల సంబంధాలు ఖచ్చితంగా ఉంటాయి. అది పెళ్లి కావచ్చు, సహజీవనం కావచ్చు. స్త్రీపురుషులు కలసి ఉండటం అనేది ఇద్దరు మనుషుల వ్యక్తిత్వాల మీద ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో అన్ని మతాలలోనూ వివాహవ్యవస్థ ఉంది. ఈ వివాహవ్యస్థలో ఉన్న ఒక ఆడ, మగ మధ్య కొన్ని అపార్థాలు, గొడవలు క్రియేట్ అవుతూ ఉంటాయి. రిలేషన్ మొదలవ్వడానికి ముందు జరిగిన విషయాలు, కొన్ని పరిష్కారం దొరకని సమస్యలు, గందరగోళ పరిస్థితులను భాగస్వామి సాల్వ్ చేస్తారని […]
సాధారణంగా ఏ దేశంలో అయినా స్త్రీపురుషుల సంబంధాలు ఖచ్చితంగా ఉంటాయి. అది పెళ్లి కావచ్చు, సహజీవనం కావచ్చు. స్త్రీపురుషులు కలసి ఉండటం అనేది ఇద్దరు మనుషుల వ్యక్తిత్వాల మీద ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో అన్ని మతాలలోనూ వివాహవ్యవస్థ ఉంది. ఈ వివాహవ్యస్థలో ఉన్న ఒక ఆడ, మగ మధ్య కొన్ని అపార్థాలు, గొడవలు క్రియేట్ అవుతూ ఉంటాయి. రిలేషన్ మొదలవ్వడానికి ముందు జరిగిన విషయాలు, కొన్ని పరిష్కారం దొరకని సమస్యలు, గందరగోళ పరిస్థితులను భాగస్వామి సాల్వ్ చేస్తారని అనుకుంటారు. కొన్ని పొరపాట్ల వల్ల రిలేషన్ సమస్యల్లోకి, అపార్థాల్లోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి.
బంధాలను కాపాడుకోవాలన్నా, ఒకరినొకరు అర్థం చేసుకోవాలన్నా, ఎమోషన్స్ ను, అసౌకర్యాన్ని ఇతర సమస్యలను అర్థం చేసుకోవాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ఆరోగ్యకరమైన స్పేస్ మరియు కాసింత ఫ్రీడమ్ ఉండటం చాలా ముఖ్యం. బయటకు చెప్పలేని కొన్ని విషయాలు వల్ల రిలేషన్స్ ఎలా సమస్యలోకి జారిపోతాయో అవేంటో సైకాలజిస్ట్ లు వివరించారు.
పెరిగిన వాతావరణం!!
రెండు వేర్వేరు ప్రాంతాల వ్యక్తులు రిలేషన్ అనే సర్కిల్ లోకి వెళ్లడమైతే జరుగుతుంది కానీ అన్నేళ్ళుగా నివసించిన ప్రాంతాలు, అలవాట్లు, ఇష్టాల విషయంలో ఒక్కసారిగా మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. వీటి విషయంలో అడ్జస్ట్మెంట్ అనే పదం తమ డిక్షనరిలో లేని వాళ్ళు చాలా ఇబ్బంది ఎదుర్కుంటారు. కొందరు కొన్ని విషయాలను బయటకు చెప్పలేరు.
ఎక్పెక్టేషన్స్!!
ఎక్పెక్టషన్స్ అనేవి చాలామందిలో ఉంటాయి. రిలేషన్ లో అయితే ఇవి రోజు రోజుకు పెరుగుతూ ఉంటాయి. వీటి విషయంలో ఏమాత్రం నిరాశ ఎదురైన ఏదో చెప్పలేని తప్పు చేసాము ఈ రిలేషన్ లోకి వచ్చిపడి అనే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది కొందరికి. కాబట్టి ఎక్పెక్టేషన్స్ అనేవి ఎక్కడా మంచి చేయవు.
అటెన్షన్!!
లైఫ్ పార్టనర్ నుండి అటెన్షన్ కోరుకోవడం అనేది అందరి మనసులో ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఇది ఎక్కువగా ఉంటుంది. తన కోసం అది చెయ్యాలి ఇది చెయ్యాలి, అలా ఉండాలి ఇలా ఉండాలి అనే ఎక్పెక్టేషన్స్ మాత్రమే కాకుండా ఎంతమందిలో ఉన్నా, ఎక్కడైనా తన విషయంలో అటెన్షన్ గా ఉండాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు లైఫ్ పార్టనర్ చాలా ముఖ్యమైన సందర్భాలలో అటెన్షన్ ఇవ్వలేకపోవచ్చు కదా అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.
నిరాశలో కూరుకుపోవడం!!
కోరుకున్నది, ఊహించింది జరగకపోతే దాన్ని చాలా సీరియస్ ప్రాబ్లెమ్ గా తీసుకుని నిరాశలో కూరుకుపోయి ఏదో పోగొట్టుకున్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ ఎక్పెక్టేషన్స్, వాళ్ళ డ్రీమ్స్ ఒక్కసారిగా తలకిందులు అవ్వడంతో నిరాశ కాస్తా కంట్రోల్ తప్పేలా చేస్తుంది.
జడ్జ్ చేయడం!!
కొన్నిసార్లు అవతలి వాళ్లకు కరెక్ట్ అనిపించింది మనకు కరెక్ట్ అనిపించకపోవచ్చు. అంతమాత్రం చేత అది తప్పు అని చెప్పకూడదు. ప్రతి మనిషి మానసిక పరిస్థితిని బట్టే ఏదైనా చేస్తారు కాబట్టి జడ్జ్ చేయడం తప్పు.
మనసులో భావాన్ని చెప్పలేకపోవడం!!
చాలామంది ఇళ్లలో తమకు ఏమి కావాలో అడిగే స్వేచ్ఛ ఉండదు. పెద్దవాళ్ళు ఇచ్చిన దాంతో అడ్జస్ట్ అయిన ఆడవాళ్లు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్లకు లైఫ్ పార్టనర్ ను తమకు అవసరమైనది ఏదైనా ఎలా అడగాలి తెలియకపోవచ్చు. కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల అపార్థాలు చాలా తొందరగా చోటుచేసుకుంటాయి.
ఇవి మాత్రమే కాకుండా ప్రతి మనిషి ఎమోషన్ అండ్ మెచ్యూరిటీ స్టేజ్ ను అర్థం చేసుకోకపోవడం వల్ల అపార్థాల వలయం కాస్తా అగాధంగా మారిపోయే అవకాశం ఉంటుంది.