ధ్యానంతో ఏం పొందగలం?

ధ్యానం అనేది ఋషులు, యోగులు మాత్రమే చేసే కష్టమైన సాధన అని పురాణాలు చెపుతున్నాయి. అయితే, అది నిజం కాదు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం నుండి మనలో స్వీయ-అవగాహనను ప్రోత్సహించడం వరకు మనల్ని ప్రభావితం చేసే అనేక మార్గాలు ధ్యానంలో ఉన్నాయి. ధ్యానం అనేది మన మనస్సుతో మనల్ని మనం కనెక్ట్ చేసుకునే మార్గం. ఇది స్వీయ-అవగాహనతో ధ్యానం సాధించే ప్రక్రియ. ధ్యానం అనేది పూర్తిగా విశ్రాంతి సమయం. దీనిని మీకు అనుకూలమైన సమయంలో చెయ్యాలి. కనుక […]

Advertisement
Update:2022-07-04 11:34 IST

ధ్యానం అనేది ఋషులు, యోగులు మాత్రమే చేసే కష్టమైన సాధన అని పురాణాలు చెపుతున్నాయి. అయితే, అది నిజం కాదు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం నుండి మనలో స్వీయ-అవగాహనను ప్రోత్సహించడం వరకు మనల్ని ప్రభావితం చేసే అనేక మార్గాలు ధ్యానంలో ఉన్నాయి. ధ్యానం అనేది మన మనస్సుతో మనల్ని మనం కనెక్ట్ చేసుకునే మార్గం. ఇది స్వీయ-అవగాహనతో ధ్యానం సాధించే ప్రక్రియ. ధ్యానం అనేది పూర్తిగా విశ్రాంతి సమయం.

దీనిని మీకు అనుకూలమైన సమయంలో చెయ్యాలి. కనుక మీకు ఆటంకం కలగని సమయాన్ని, ప్రాంతాన్నిఎంచుకోవాలి. మాములుగా సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలలో ధ్యానం చేయడంవల్ల మనసు ఉల్లాసంగాను, ప్రశాంతంగాను ఉంటుంది.

మీకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకున్నట్టుగానే మీకు ఆటంకము కలగని ప్రదేశాన్ని కూడా ఎంచుకోవడం వల్ల ప్రశాంతమైన పరిసరాలకు దగ్గరగా ఉండి మనసును కేంద్రీకరించగలుగుతారు. ఇవన్నీ మనకు ధ్యానం చేసిన అనుభూతిని ఆస్వాదించే విధంగా సాయపడతాయి.

ఎటువంటి భంగిను ఎంచుకోవాలి..

అంతేకాకుండా మీరు ఎంచుకునే భంగిమ కూడా మీ ధ్యానం మీద ప్రభావం చూపుతుంది. కూర్చున్న భంగిమలో ప్రశాంతంగా, సౌకర్యవంతంగా, స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉండేలా నేరుగా కూర్చోవాలి.

ధ్యానం చేసినంతసేపు కళ్ళు మూసుకొని భుజములు, మెడ ప్రశాంతంగా రిలాక్స్ గా ఉంచాలి. అయితే పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేయమని మన పురాణాలు చెబుతున్నాయి. ఇలా చేయలేనివారు పద్మాసనం వేయడానికి ఇబ్బంది పడేవారు.. వారికి సులువుగా ఉండేట్టుగా.. కుర్చీలో కూర్చుని కూడా ధ్యానాన్ని చేయవచ్చు.

ధ్యానం ఎప్పుడు చేయాలి..

ధ్యానం భోజనం చెయ్యడానికి ముందు చెయ్యడం మంచిది. ఒకవేళ మీరు భోజనం చేసిన తరువాత ధ్యానం చేస్తే నిద్ర రావచ్చు. ఆకలిగా వున్నపుడు ధ్యానం చెయ్యడానికి ప్రయత్నించకపోవడమే మంచిది. ఎందుకంటే మీ ధ్యాసంతా ఆకలి మీదకు వెళుతుంది.

ఐతే భోజనం చేసిన 2 గంటల తరువాత ధ్యానంలో కూర్చోవడం మంచిదంటున్నారు నిపుణులు. దీనివల్ల నిద్ర సమస్య దరిచేరకపోవడమే కాకుండా, ఏకాగ్రతతో ధ్యానంలో కూర్చునే వీలు కలుగుతుంది. ధ్యానంలో మనం ఎంచుకునే సులభమైన వ్యాయామం లేదా సూర్య నమస్కారాలు చెయ్యడం వలన రక్త ప్రసరణ జరుగుతుంది. శరీరంలో వున్న జడత్వం పోయి శరీరం తేలికగా అనిపిస్తుంది. ఇలా చెయ్యడం వలన మీరు ధ్యానంలో చాలాసేపు కూర్చోగలరు.

చిరునవ్వుతో ధ్యానం చెయ్యడం వలన ప్రశాంతమైన అనుభవం పొందగలరు. ధ్యానం చేయడం పూర్తి అయిన తరువాత కంగారు పడకుండా నెమ్మదిగా మీ పరిసరాలు గుర్తుకు తెచ్చుకుని నెమ్మదిగా కళ్ళు తెరవాలి.

ధ్యానం దేహానికి ఏలా సహాయపడుతుంది..

ధ్యానం దృష్టి మనస్సు – ఇది మనస్సును నిశ్చలంగా మార్చగలుగుతుంది. మనస్సును నిశ్శబ్దంగా చేయడమే కాకుండా స్పృహ, బుద్ధి, ఆలోచనా రహిత స్థితికి, సాక్షాత్కార స్థితికి దారి చూపుతుంది.

మనం భగవంతుడు అని పిలుస్తున్న అత్యున్నత అమర శక్తికి కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. దానికంటే ముందు ధ్యానం మన మనస్సును, మన మానసిక స్థితిని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది.

ఆలోచనల మీద, ఉద్వేగాల మీద అదుపు కలిగేవిధంగా మానసిక ప్రశాంతతను ఇస్తుంది. దానివలన మానసిన దృఢత్వంతో ఉండటమేకాకుండా త్వరగా రోగాలకు గురికారు. ఒక వేళ రోగాల బారిన పడినా త్వరగా కోలుకుంటారు.

సదవగాహన కలిగి, సమర్థత పెరిగి ఏ విషయంలోనూ ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకోవడానికి ధ్యానం ఎంతో సహకరిస్తుంది. మనపై మనకు నమ్మకాన్ని పెంచుతుంది.

Tags:    
Advertisement

Similar News