పిల్లల కోసం ఎటువంటి మాస్క్ ఎంచుకోవాలి

గత రెండేళ్ళలో పిల్లల్ని శుభ్రమైన వాతావరణంలో ఉంచటమే కాకుండా పెద్దల సంరక్షణలో చాలావరకూ కరోనా బారిన పడకుండా కాపాడుకుంటూ వచ్చాం.. అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగైనట్టు కనిపించినా మళ్ళీ ఏదో చోట కరోనా వ్యాపిస్తుందనే వార్తలు వింటూనే ఉన్నాం. స్కూళ్ళు ఓపిన్ అయ్యి పిల్లలంతా ఇళ్ళల్లోంచి బయటకు వస్తున్న సమయంలో వాళ్ల ఆరోగ్య విషయంలో మరింత శద్ధ తీసుకోవడం ప్రతి తల్లితండ్రులకు చాలా అవసరం. కరోనా మహమ్మారి నుంచి పెద్దలకన్నా పిల్లలను కాపాడుకోవడంలోనే ఇప్పుడు మనం […]

Advertisement
Update:2022-07-02 05:55 IST

గత రెండేళ్ళలో పిల్లల్ని శుభ్రమైన వాతావరణంలో ఉంచటమే కాకుండా పెద్దల సంరక్షణలో చాలావరకూ కరోనా బారిన పడకుండా కాపాడుకుంటూ వచ్చాం.. అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగైనట్టు కనిపించినా మళ్ళీ ఏదో చోట కరోనా వ్యాపిస్తుందనే వార్తలు వింటూనే ఉన్నాం. స్కూళ్ళు ఓపిన్ అయ్యి పిల్లలంతా ఇళ్ళల్లోంచి బయటకు వస్తున్న సమయంలో వాళ్ల ఆరోగ్య విషయంలో మరింత శద్ధ తీసుకోవడం ప్రతి తల్లితండ్రులకు చాలా అవసరం.

కరోనా మహమ్మారి నుంచి పెద్దలకన్నా పిల్లలను కాపాడుకోవడంలోనే ఇప్పుడు మనం దృష్టి పెట్టాల్సి ఉందని డాక్టర్స్ అంటున్నమాట. అందులోనూ స్కూళ్ళకు వెళ్ళే పిల్లల విషయంలో ముఖ్యంగా తీసుకోవలసిన జాగ్రత్తలు వాళ్ళు ధరించే మాస్క్ ల విషయంలో తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు..

అయితే రోజంతా పాఠశాలలో కిక్కిరిసిన వాతావరణంలో ఉండాలంటే వారి ఆటలు, కబుర్లు ఆహ్లాద వాతారణాన్ని వారికి దూరం చేయకుండానే కరోనాతో పోరాడే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కోవిడ్‌తో పాటు ఇతర వైరస్‌లకు వ్యతిరేకంగా ఎన్‌95 ఎఫ్‌ఎఫ్‌పి2 మాస్క్‌లు చాలా ప్రభావవంతంగా పని చేస్తాయని నిపుణులు అంటున్నారు. మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ప్రచురించిన ఒక అధ్యయనం ద్వారా ఈ వాదన రుజువు చేయబడింది, ఇవి బాగా సరిపోవడమే కాకుండా FFP2 మాస్క్‌లు COVID-19తో వ్యాపించే ప్రమాదాన్ని 0.1%కి తగ్గిస్తాయి.

పిల్లలు అకస్మాత్తుగా జెర్మ్స్, రకరకాల వ్యాధికారక సూక్ష్మజీవుల బారిన పడటం అనేది తరచుగా జరుగుతూనే ఉంటుంది. ఇక స్కూళ్ళు మొదలయ్యాకా మాస్క్ ధరించడంలోనూ, శానిటైజర్ ని వాడటంలోనూ, అలాగే సామాజిక దూరాన్ని పాటించడంలోనూ పిల్లలకి అవగాహన కల్పించాలి. పిల్లలకోసం N95, FFP2 మాస్క్‌లు వాడే విషయంలో అసౌకర్యం కలగకుండా ఉండటమే కాకుండా శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది లేకుండా చేస్తాయని అంటున్నారు. మళ్ళీ మళ్ళీ ఉపయోగించే విధంగా వీటిని డిజైన్ చేసారు.

పిల్లలకు సరైన మాస్క్ లను ఎలా ఎంచుకోవాలి..
పిల్లల కోసం మంచి N95 మాస్క్‌ను కనుగొనే విషయానికి వస్తే, కింది విషయాలపై దృష్టి పెట్టాలి.

వడపోత: అధిక వైరల్ ఫిల్ట్రేషన్ సామర్థ్యాన్ని (96%) అందించే N95 మాస్క్‌లు, పర్టిక్యులేట్ ఫిల్ట్రేషన్ ఎఫిషియెన్సీ మాస్క్ ధరించే వారిలో విశ్వాసాన్ని నింపుతాయి.

ఫిట్: స్నగ్ ఫిట్‌గా ఉండేలా అడ్జస్టబుల్ నోస్‌బ్యాండ్, ఇయర్ లూప్‌లతో ఉండేవిధంగా మాస్క్‌ని ఎంచుకోవాలి.

కంఫర్ట్: N95 మాస్క్‌ను ధరించేటప్పుడు పిల్లలు సులభంగా శ్వాస పీల్చుకునేలా రోజంతా మాస్క్ ను వేసుకున్నా చికాకు కలగకుండా చేస్తుంది.

డిజైన్: మీ పిల్లల కోసం సరదాగా N95 మాస్క్ డిజైన్‌లను అందించే మాస్క్ కంపెనీని ఎంచుకోండి, దానివల్ల పిల్లలు వాటిని తమతోనే ఉంచుకోవడానికి, వాడటానికి ఇష్టపడతారు.

మన్నిక: కోవిడ్-19 ఉన్నంత కాలం, మీరు 5-6 నెలల పాటు ఉండేలా ఉతికినా ఎటువంటి డ్యామేజ్ కాని N95 మాస్క్‌లని ఎంచుకోవాలి.

ధృవపత్రాలు: మీరు మాస్క్‌ని కొనేముందు వాటి నాణ్యత అలాగే పరిక్షా నివేదికల పత్రాలను తీసుకోవాలి. దానివల్ల మనం ఎంచుకున్న మాస్క్ ఎంత సురక్షితమైనదో తెలియడంతో పాటు నమ్మకంగా పిల్లలను వాడవచ్చు.

సర్జికల్ మాస్క్‌లు లేదా క్లాత్ మాస్క్‌లు ఎందుకు తగినంత రక్షణ ఇవ్వవు.
3-ప్లై & సర్జికల్ మాస్క్ (నాన్-సర్టిఫైడ్) విషయంలో, ఈ మాస్క్‌ల లోపల ఉంచిన మెల్ట్-బ్లోన్ పాలిమర్ సూక్ష్మజీవులు మాస్క్‌లలోకి ప్రవేశించకుండా ఆపే ఫిల్టర్‌గా పని చేస్తాయి. అయినప్పటికీ, 3-ప్లై ,సర్జికల్ మాస్క్‌ల అంచులు మీ ముక్కు లేదా నోటి చుట్టూ గట్టి సీల్‌ను ఏర్పరచవు, దానివల్ల వైరస్‌లు, ఏరోసోల్ పీల్చడం తో గాలి మార్గంలోకి ప్రవేశిస్తాయి. ఈ మాస్క్ లు పీల్చే గాలిపై వడపోత చేయలేవు. ఎలాంటి రక్షణను ఇవ్వగలవో సర్టిఫికేట్ ను కూడా తీసుకోలేము.

వదులుగా నేసిన గుడ్డ మాస్క్‌లు గాలిపీల్చే సమయంలో ఎటువంటి వడపోతను అందించవు కాబట్టి అవి తక్కువ రక్షణను అందిస్తాయి. క్లాత్ మాస్క్‌లు వడపోత సామర్ధ్యాన్ని 1.4 శాతం కంటే తక్కువగా కలిగి ఉంటాయని ఒక అధ్యయనం కనుగొంది. ఇటువంటి సమయాల్లో N95, FFP2 మాస్క్ లు మీ పిల్లలకు ఆరోగ్య విషయంలో భరోసాగా నిలుస్తాయి. మిగతా వాటితో పోలిస్తే గాలి పీల్చే విషయంలో సులువుగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాయి. ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తాయి.

Tags:    
Advertisement

Similar News