ఆరోగ్యాన్నిచ్చే అద్భుతమైన అవకాడో

ఈ మధ్య కాలంలో బాగా వినియోగిస్తున్న పండ్లలో అవకాడో (Avocado) ఒకటి. ఫారిన్ ఫ్రూట్ అయిన అవకాడో ధర విషయంలోనే ఎక్కువ కాదు ఇందులో పోషకాలు కూడా ఎక్కువే!! అవకాడోలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, పాలి అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పెట్రో న్యూట్రిషన్స్, బయో ఆక్టివ్ కాంపౌండ్స్ మొదలైనవి ఉంటాయి. అవకాడో తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్, క్యాన్సర్, లివర్ డామేజ్, అల్జీమర్, డిప్రెషన్ మొదలైన సమస్యలను తగ్గించుకోవచ్చని వైద్యులు దృవీకరిస్తున్నారు. భారతదేశంలో పండకపోయినా వాటికి లభిస్తున్న ఆదరణ […]

Advertisement
Update:2022-07-02 05:18 IST

ఈ మధ్య కాలంలో బాగా వినియోగిస్తున్న పండ్లలో అవకాడో (Avocado) ఒకటి. ఫారిన్ ఫ్రూట్ అయిన అవకాడో ధర విషయంలోనే ఎక్కువ కాదు ఇందులో పోషకాలు కూడా ఎక్కువే!! అవకాడోలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, పాలి అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పెట్రో న్యూట్రిషన్స్, బయో ఆక్టివ్ కాంపౌండ్స్ మొదలైనవి ఉంటాయి. అవకాడో తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్, క్యాన్సర్, లివర్ డామేజ్, అల్జీమర్, డిప్రెషన్ మొదలైన సమస్యలను తగ్గించుకోవచ్చని వైద్యులు దృవీకరిస్తున్నారు.

భారతదేశంలో పండకపోయినా వాటికి లభిస్తున్న ఆదరణ వల్ల క్రమంగా అవకాడో దిగుమతులు పెరుగుతున్నాయి. అవకాడోను సలాడ్ లు, సూప్ లు, భోజనం ఇంకా ఉడకబెట్టిన గుడ్డు మొదలైన అన్ని విధాలుగా వాడుతున్నారు. ఈమధ్య కాలంలో అమెరికా హార్ట్ అసోసియేషన్ 11,000 మంది 30 సంవత్సరాల పైబడిన మహిళలతో జరిపిన పరిశోధన ప్రకారం అవకాడోను ఆహారంలో తీసుకున్న వారిలో కార్డియో వాస్కులర్ సమస్య వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు తెలిశాయి. అలాంటి అవకాడో తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోవడం అందరి వంతు అవుతుంది.

డిప్రెషన్ ను తరిమికొడుతుంది:
చాలామంది డిప్రెషన్ అనగానే యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటి సలహాలు ఇస్తారు. అయితే అవకాడో తీసుకోవడం వల్ల డిప్రెషన్ కు చెక్ పెట్టచ్చు. ఇందులో ఎక్కువగా లభ్యమయ్యే ఫోలేట్ మెదడు మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా మెదడును రిలాక్స్ గా ఉంచే డోపమైన్, సెరోటోనిన్‌ అనే రసాయనాలు అందెలా చేస్తుంది.

అల్జీమర్స్ కు అద్భుత ఔషధం:
మెదడుకు సంబంధించిన సమస్యల్లో అల్జీమర్స్ ఒకటి. మతిమరుపు కేటగిరికి చెందిన ఈ అల్జీమర్స్ దశల వారిగా ఎంతో ఇబ్బంది పెడుతుంది. మెదడు నరాల సమస్య వల్ల ఏర్పడే అల్జీమర్స్ ఇంకా పార్కిన్సన్ సమస్యల ప్రభావాన్ని చాలా తగ్గిస్తుంది.

కంటి చూపును యవ్వనాన్ని అందిస్తుంది:
ఈ కాలంలో చిన్న పిల్లలకు కూడా కంటి సమస్యలు వచ్చేసి కళ్ళద్దాలు పెట్టే పరిస్థితి వస్తోంది. అవకాడో లో ఉండే కెరోటినాయిడ్స్, ల్యూటీన్, జియాక్స్తిన్ మొదలైనవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా ఇవి గొప్ప యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తాయి. అందువల్ల అవకాడో తీసుకుంటే కంటిచూపు మాత్రమే కాకుండా చర్మాన్ని సంరక్షించి యవ్వనంగా కూడా ఉంచుతుంది.

గర్భవతులకు గిఫ్ట్!
ప్రెగ్నెంట్ మహిళలకు అవకాడో బెస్ట్ గిఫ్ట్ ఫ్రూట్ అని చెప్పవచ్చు. వీటిలో ఫోలేట్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఫైబర్, మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్, లిపిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మొదలైనవి ఉంటాయి. ఇవి కడుపులో ఎదుగుతున్న పిండానికి గొప్ప పోషకాలుగా సహాయపడతాయి. పుట్టుక లోపాలను అధిగమించేలా చేస్తాయి. అంతే కాకుండా తల్లి పాలను తగినంత ఉత్పత్తి అయ్యేలా చేయడంలో కూడా అవకాడో సహాయపడుతుంది.

పిల్లల కోసం బెస్ట్ ఆప్షన్!
పిల్లలకు జ్ఞాపకశక్తి సరిగ్గా ఉండటం లేదని, చురుగ్గా ఉండలేకపోతున్నారని బాధపడే తల్లులకు అవకాడో ఒక బెస్ట్ ఆప్షన్. అవకాడోను ఏదో ఒక రూపంలో పిల్లలకు అందిస్తూ ఉంటే అందులో ఉండే ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్, ఓలిక్ యాసిడ్ మెదడును చురుగ్గా ఉంచి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

మన గుండెకు రక్షణ ఇస్తుంది!
రోజుకు ఒక యాపిల్ తినమని ఎంతోమంది డాక్టర్స్ చెబుతారు. కానీ రోజుకు ఒక అవకాడో తింటే గుండె పనితీరు విషయంలో అసలు బెంగపడాల్సిన అవసరమే లేదంటున్నారు కొందరు పోషకాహార నిపుణులు. అవకాడో గుండె పనితీరును ఇబ్బంది పెట్టే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ అందేలా చేస్తుంది. ఇది మాత్రమే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

Tags:    
Advertisement

Similar News