20 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విపరీతమైన కాంపిటీషన్ నడుస్తుంది. తక్కువ ధరల్లోనే హై ఎండ్ ఫీచర్స్ ఉన్న మొబైల్స్ ఎన్నో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొబైల్ కొనేముందు కెమెరా, ప్రాసెసర్ , స్క్రీన్, పెర్ఫామెన్స్.. ఇలా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. రూ.20 వేల లోపు మెరుగైన ఫీచర్లు కలిగిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల లిస్ట్ చూస్తే.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ వన్‌ప్లస్ […]
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విపరీతమైన కాంపిటీషన్ నడుస్తుంది. తక్కువ ధరల్లోనే హై ఎండ్ ఫీచర్స్ ఉన్న మొబైల్స్ ఎన్నో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొబైల్ కొనేముందు కెమెరా, ప్రాసెసర్ , స్క్రీన్, పెర్ఫామెన్స్.. ఇలా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. రూ.20 వేల లోపు మెరుగైన ఫీచర్లు కలిగిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల లిస్ట్ చూస్తే..
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ మొబైల్.. వన్‌ప్లస్ నుంచి రిలీజ్ అయిన బడ్జెట్ మోడల్ ఇది. 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సెల్ ఉంటుంది. ఈ మొబైల్‌లో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్, ఓక్టాకోర్ సీపీయూ (2.2గిగా హెర్ట్జ్, డ్యుయల్ కోర్), 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్ ధర రూ.19,999.
శాసంగ్ గ్యాలాక్సీ ఎమ్ 33 5జీ
తక్కువ బడ్జెట్లో శాంసంగ్ అందిస్తున్న 5జీ స్మార్ట్ ఫోన్ ఇది. ఇందులో శాంసంగ్ ఎక్సైనోస్ 1289 ప్రోసెసర్ ఉంది. ఎల్‌సీడీ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్ 6.6 అంగుళాలు ఉంటుంది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ ధర రూ.17,999 ఉంది.
పొకో ఎక్స్4
పొకో ఎక్స్4 ఫోన్.. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వస్తుంది. దీని డిస్‌ప్లే 6.67 అంగుళాలు. 64 ఎంపీ, 8ఎంపీ, 2 ఎంపీ సామర్థ్యం గల మూడు రేర్ కెమెరాలు, 16 మెగా పిక్సెల్‌తో ఫ్రంట్ కెమెరా ఉంటాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ ఉంటుంది. 6జీబీ రామ్, 64 జీబీ స్టోరేజ్ రోమ్ సామర్థ్యంతో వచ్చే ఈ ఫోన్ ధర రూ.16,999.
రెడ్‌మీ నోట్ 11 ప్రో
రెడ్ మీ నోట్ 11ప్రో మొబైల్.. స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్, ఎల్ఈడీ ప్యానెల్‌తోపాటు 108ఎంపీ, 8ఎంపీ, 2 ఎంపీ సామర్థ్యం గల మూడు కెమెరాలతో వస్తుంది. ఫ్రంట్‌లో 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. టర్బో చార్జింగ్ సపోర్ట్‌తోపాటు 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్‌కు 6జీబీ రామ్, 128 జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది. దీని ధర రూ.19,999.
వివో టీ1 5జీ
6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే స్క్రీన్‌తో లభించే వివో టీ1 5జీ స్మార్ట్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 685 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. 28జీబీ స్టోరేజీతోపాటు 8జీబీ రామ్ కలిగి ఉంటుంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెల్ఫీ కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. దీని ధర రూ.15,990. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో 5000ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది.