మోదీ చదువుకోలేదు.. అందుకే ఇలాంటి నిర్ణయాలు..

ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మోదీ పెద్దగా చదువుకోలేదని, అందుకే అగ్నిపథ్ లాంటి పథకాలను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారాయన. మోదీకి చదువు తక్కువ కావడం వల్లే అస్తవ్యస్త నిర్ణయాలతో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నేతలకు కానీ, మోదీకి కానీ.. సైన్యం ఎలా పనిచేస్తుందో తెలియదని, వారు కనీసం తమ బుర్ర అప్లై చేయడం లేదని విమర్శించారు. ఏ విషయంలో అయినా గందరగోళం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం […]

Advertisement
Update:2022-06-26 15:50 IST

ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మోదీ పెద్దగా చదువుకోలేదని, అందుకే అగ్నిపథ్ లాంటి పథకాలను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారాయన. మోదీకి చదువు తక్కువ కావడం వల్లే అస్తవ్యస్త నిర్ణయాలతో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నేతలకు కానీ, మోదీకి కానీ.. సైన్యం ఎలా పనిచేస్తుందో తెలియదని, వారు కనీసం తమ బుర్ర అప్లై చేయడం లేదని విమర్శించారు.

ఏ విషయంలో అయినా గందరగోళం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం బీజేపీకి అలవాటని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్మీ.. ఏ విభాగం ఎలాంటి విధులు నిర్వహిస్తుందో బీజేపీ నేతలకు తెలియదని విమర్శించారు. ఇతర దేశాలు దాడులు చేసినప్పుడు జవాన్లను వాడతారని.. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు బీజేపీ నేతలు రంగంలోకి దిగుతారని అన్నారు. నాలుగేళ్లు ఆయుధాలు వాడటం ఎలాగో నేర్పించి బయటకు పంపిస్తే యువత ఏం చేస్తారని నిలదీశారాయన. అగ్నిపథ్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఇప్పటి వరకూ జరిగిన రాద్ధాంతానికి మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా సోమవారం తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.

టీఆర్ఎస్ పరోక్ష మద్దతు..
అగ్నిపథ్ పథకం గురించి కేంద్ర మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి. శిక్షణలో బట్టలు ఉతకడం నేర్పిస్తారంటూ కిషన్ రెడ్డి చెప్పారని, మరో మంత్రి.. బీజేపీ ఆఫీస్ ల ముందు వారిని సెక్యూరిటీ గార్డ్ లుగా తీసుకుంటామని అన్నారని.. ఇలాంటి వ్యాఖ్యలు సైన్యం మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయం వల్లే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాల్పులు జరిగి ఓ యువకుడు మరణించారని, తిరిగి అదే పార్టీ నేతలు అంతిమయాత్రలో పాల్గొని నాటకాలాడారంటూ విమర్శించారు. యువకులకు అండగా ఉండే పార్టీ కేవలం కాంగ్రెస్ మాత్రమేనని, టీఆర్ఎస్ పరోక్షంగా అగ్నిపథ్ కు మద్దతు ఇస్తుందని మండిపడ్డారాయన.

Tags:    
Advertisement

Similar News