మధుమేహానికి ఆయుర్వేద చిట్కాలు

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ముందుంటుంది. మ‌నదేశంలో సుమారు 7 కోట్ల మంది డయాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిని ఇది వేధిస్తోంది.రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో ఆయుర్వేద పద్ధతులు కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం డయాబెటిస్‌ను ఎలా కంట్రోల్ చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి, కాకరకాయలకు రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసే శక్తి ఉంది. డయాబెటిస్ ఉన్నవారు ఉసిరికాయ, […]

Advertisement
Update:2022-06-25 08:49 IST

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ముందుంటుంది. మ‌నదేశంలో సుమారు 7 కోట్ల మంది డయాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిని ఇది వేధిస్తోంది.రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో ఆయుర్వేద పద్ధతులు కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం డయాబెటిస్‌ను ఎలా కంట్రోల్ చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయుర్వేదం ప్రకారం ఉసిరి, కాకరకాయలకు రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసే శక్తి ఉంది. డయాబెటిస్ ఉన్నవారు ఉసిరికాయ, కాకరకాయ, పసుపు కలిపి పేస్ట్‌గా చేసి రోజూ తీసుకోవడం ద్వారా షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.

దాల్చిన చెక్కకు ఇన్సులిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేసే శక్తి ఉందని ఆయుర్వేదం చెప్తోంది. అందుకే రోజువారీ టీ లేదా పానీయాల్లో దాల్చిన చెక్కను చేర్చుకుంటే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.

మెంతుల్లో ఔషధ గుణాలు ఎక్కువ. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చెయ్యడంలో సాయపడతాయని ఆయుర్వేదం చెప్తోంది. అందుకే డయాబెటిస్ పేషెంట్లు రోజువారీ ఆహారంలో మెంతులను కూడా చేర్చుకోవాలి.

అవిసె గింజలకు రక్తంలో ఇన్సులిన్ లెవల్స్‌ను కంట్రోల్ చేసే శక్తి ఉందని ఆయుర్వేదం చెప్తోంది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే అవిసె గింజలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా షుగర్ లెవల్స్ పెరగకుండా జాగ్రత్తపడొచ్చు.

ఇకపోతే డయాబెటిస్ ఉన్నవారు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం ద్వారా మ‌ధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

అలాగే దానిమ్మ, యాపిల్, ఉసిరి, బెర్రీస్ వంటి పండ్లు.. కాకరకాయ, బెండకాయ వంటి కాయగూరలు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు సాయపడతాయని ఆయుర్వేదం చెప్తోంది. ఇక వీటన్నింటితో పాటు ఒత్తిడి లేని లైఫ్‌స్టైల్ ద్వారా డయాబెటిస్‌ను ఎఫెక్టివ్‌గా కంట్రోల్ చేయొచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. దానికోసం యోగా, ధ్యానం లాంటివి రోజూ చేయాలని వారు సూచిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News