తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కు రాజ్యసభ సీటు

బీజేపీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను రాజ్యసభకు పంపబోతోంది.నామినేషన్లకు నేడు చివరి రోజు కావడంతో గత రాత్రి ఆయన పేరును ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేస్తోంది. ఈ మేరకు గత రాత్రి నలుగురు అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది.. మధ్యప్రదేశ్ నుంచి సుమిత్రా వాల్మీకి, కర్ణాటక నుంచి లహర్ సింగ్ సిరోయ, ఉత్తరప్రదేశ్ నుంచి మిథిలేష్ కుమార్, డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్లను ప్రకటించింది. డాక్టర్ కె.లక్ష్మణ్ […]

Advertisement
Update:2022-05-31 01:42 IST

బీజేపీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను రాజ్యసభకు పంపబోతోంది.నామినేషన్లకు నేడు చివరి రోజు కావడంతో గత రాత్రి ఆయన పేరును ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేస్తోంది. ఈ మేరకు గత రాత్రి నలుగురు అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది.. మధ్యప్రదేశ్ నుంచి సుమిత్రా వాల్మీకి, కర్ణాటక నుంచి లహర్ సింగ్ సిరోయ, ఉత్తరప్రదేశ్ నుంచి మిథిలేష్ కుమార్, డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్లను ప్రకటించింది.

డాక్టర్ కె.లక్ష్మణ్ తెలంగాణ బీజేపీ చీఫ్‌గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. లక్ష్మణ్ స్థానంలో బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్షుడిని చేసిన తర్వాత ఆయనకు ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్ష పదవి ఇచ్చారు. కాగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం నుంచి బీజేపీ తరపున రాజ్యసభకు వెళ్తున్న తొలి వ్యక్తిగా లక్ష్మణ్ రికార్డులకెక్కనున్నారు.

Tags:    
Advertisement