రూపం మారిన దళిత ఉద్యమం

పదిరోజుల క్రితం అహమ్మదాబాద్‌లో ప్రారంభమైన దళిత అస్మిత యాత్ర ఆగస్టు 15న ఉనాకు చేరింది. ఉనాలో లక్షలాది మందితో సభ జరిగింది. దళితులతోపాటు ముస్లింలు పెద్దెత్తున పాల్గొన్నారు. భారత రాజకీయాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టేలా ఈ ప్రదర్శన జరిగింది. ఇకనుంచి మీ పాయిఖానాలు, డ్రైనేజీలు శుభ్రం చేయమని, చనిపోయిన పశువులను తీసుకెళ్ళమని ప్రతిన బూనారు. ఇక మాకీ వృత్తులు వద్దు. భూమి కావాలి వ్యవసాయం చేసుకుంటామని నినదించారు. గుజరాత్‌లోని ఉనాలో నాలుగు వారాల క్రితం నలుగురు దళిత యువకులను గోరక్షక […]

Advertisement
Update:2016-08-15 12:23 IST

పదిరోజుల క్రితం అహమ్మదాబాద్‌లో ప్రారంభమైన దళిత అస్మిత యాత్ర ఆగస్టు 15న ఉనాకు చేరింది. ఉనాలో లక్షలాది మందితో సభ జరిగింది. దళితులతోపాటు ముస్లింలు పెద్దెత్తున పాల్గొన్నారు. భారత రాజకీయాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టేలా ఈ ప్రదర్శన జరిగింది. ఇకనుంచి మీ పాయిఖానాలు, డ్రైనేజీలు శుభ్రం చేయమని, చనిపోయిన పశువులను తీసుకెళ్ళమని ప్రతిన బూనారు. ఇక మాకీ వృత్తులు వద్దు. భూమి కావాలి వ్యవసాయం చేసుకుంటామని నినదించారు.

గుజరాత్‌లోని ఉనాలో నాలుగు వారాల క్రితం నలుగురు దళిత యువకులను గోరక్షక సంస్థ యువకులు కారుకు కట్టేసి, చొక్కాలు చించేసి, కర్రలతో, ఇనుప రాడ్లతో పశువులను బాదినట్లు బాదిన ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులను కదిలించి వేసింది. దేశంలో దళితులు ఆగ్రహంతో ఊగిపోయారు.

అంతులేకుండా దళితులపై సాగుతున్న దాడులకు అడ్డుకట్ట వేయకపోతే ఇక లాభం లేదనుకున్న గుజరాత్‌ దళితులకు, దేశంలోని వివిధ ప్రాంతాల దళితులు అండగా నిలిచారు.

పదిరోజుల క్రితం అహమ్మదాబాద్‌లో ప్రారంభమైన యాత్ర వేలాదిమందితో గ్రామాల గూండా సాగుతూ ఆగస్టు 15న ఉనాలో ముగియనున్న దశలో ఆగస్టు 14న నాలుగు గ్రామాలలో ఈ దళిత ఊరేగింపులపై గోరక్షకులు దాడిచేశారు. దళితులపై రాళ్ళు రువ్వారు. గాయాలపాలైన కొందరు దళితులు స్థానిక ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

ముఖ్యంగా సంతేరా గ్రామంలో ఇళ్ళల్లో ఉండే దళితుల మీదకూడా దాడులు జరిగాయి. నాలుగు వారాలక్రితం నలుగురు దళిత యువకులను కారుకు కట్టేసి కొట్టిన వాళ్ళల్లో 20 మంది ఈ గ్రామంలోని గోరక్షకులే. ఈ గ్రామంలో అగ్రవర్ణాలదే పెత్తనం.

దళితుల ఉనా యాత్ర సందర్భంగా అవాంచనీయ సంఘటనలు జరుగుతాయని ఊరేగింపుల వెంట పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించారు. కానీ పోలీసుల ముందే దళితులపై గో రక్షకులు దాడులు చేసినా పోలీసులు మౌనంగా చూస్తూ నిలబడ్డారని దళిత నాయకులు ఫిర్యాదు చేశారు.

దళిత్‌-ముస్లిమ్‌… భాయి… భాయి

ఈ పదిరోజుల్లో జరిగిన ఒక విశేష పరిణామం ఏమిటంటే. దళితుల అస్మిత యాత్రలో ముస్లిమ్‌లు పెద్ద మొత్తంలో పాల్గొనడం.

దళిత ముస్లిమ్‌ ఐఖ్యత వెనుక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరుః ముసాభాయ్‌, ఇంకొకరు జిగ్నేష్‌ మేవాని.

ఉనా యాత్రకు రూపశిల్పి జిగ్నేష్‌ మేవాని.

ముసాభాయ్‌ ముస్లిమ్‌ నాయకుడు. ఒకప్పుడు ఆయన అహమ్మదాబాద్‌ రవాణా సంస్థలో ఉద్యోగి. గుజరాత్‌ అల్లర్ల తరువాత అహమ్మదాబాద్‌ మున్సిపల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ నుంచి 3 వేల మంది డ్రైవర్లను, కండక్టర్లను ఉద్యోగాల్లోంచి తొలగించారు. వాళ్ళల్లో ఒకరు – ఈ మూసా భాయ్‌.

ముస్లిమ్‌-దళిత్‌ భాయ్‌ భాయ్‌ అనేది ఆయన నినాదం. గుజరాత్‌ అల్లర్లలో సోదరుణ్ణి పోగొట్టుకున్నాడు. దళితుల సానుభూతి పరుడు. గతంలో పదివేల మంది సఫాయి కర్మచారులకు నాయకత్వం వహించి ప్రభుత్వంతో పోరాడాడు. “గోరక్షకులు చనిపోయిన ఆవుల పేరుతో ముస్లిమ్‌లను చంపుతారు. బ్రతికిన ఆవుల పేరుతో దళితులను చంపుతారు” అనేది ఆయన సిద్ధాంతం.

“జిగ్నేష్‌ మేవాని దళిత నాయకుడు మాత్రమే కాదు. గతంలో ఆయన ముస్లిమ్‌ల కోసం పోరాడారు” అంటాడు మూసాభాయ్‌.

వీళ్ళకు తోడుగా రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి రాహుల్‌ శర్మ నిలిచాడు. ఈయన మోడీ ప్రభుత్వ బాధితుడు. గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి కొన్ని సాక్ష్యాధారాల సిడీలను ఎంక్వయిరీ కమిషన్‌కు సమర్పించినప్పటి నుంచి ఈయనకు కష్టాలు మొదలైనాయి. వాలంటెరీ రిటైర్మెంట్‌ తీసుకున్నాడు. విచారణలు ఎదుర్కొంటున్నాడు.

ఉనా ఊరేగింపును తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్‌ వాళ్ళు వచ్చి ప్రయత్నించినప్పుడు ఈ రాహుల్‌ శర్మ కాంగ్రెస్‌ వాళ్ళను ఉద్యమం దరిదాపులకు రాకుండా తరిమేశాడు.

ఈ సమాజంలో దళితులను అంటరాని వాళ్ళుగా చూడనిది ముస్లిమ్‌లు ఒక్కరేనని అందుకే వాళ్ళతో కలిసి పోరాడాలనుకుంటున్నాము – అంటున్నారు దళితులు.

పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి!

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News