తెలంగాణపై నల్లగడ్డం నజర్!
ఉత్తర భారతదేశంలో.. ముఖ్యంగా గుజరాత్‌లో రాజకీయ ప్రత్యర్థులు రెండు కోడ్ పేర్లను వాడుతుంటారు.. అవి నల్లగడ్డం, తెల్లగడ్డం. ఈ మారుపేర్లు ఎవరివో ఊహించగలరా? లేదా.. వారెవరంటే తెల్లగడ్డమంటే.. నరేంద్ర మోదీ.. నల్లగడ్డమంటే.. అమిత్‌షా. ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దాదాపుగా ఈ పేర్లను ఇప్పుడు ఎవరూ వాడటం లేదు. ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకంటే.. వీటిలో నల్లగడ్డం నజర్ అదే అమిత్ షా కన్ను తెలంగాణపై పడింది. ప్రధాని మోదీ రెండేళ్ల పాలన వేడుకలు జరుపుకొంటున్నవేళ […]
Advertisement
ఉత్తర భారతదేశంలో.. ముఖ్యంగా గుజరాత్‌లో రాజకీయ ప్రత్యర్థులు రెండు కోడ్ పేర్లను వాడుతుంటారు.. అవి నల్లగడ్డం, తెల్లగడ్డం. ఈ మారుపేర్లు ఎవరివో ఊహించగలరా? లేదా.. వారెవరంటే తెల్లగడ్డమంటే.. నరేంద్ర మోదీ.. నల్లగడ్డమంటే.. అమిత్‌షా. ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దాదాపుగా ఈ పేర్లను ఇప్పుడు ఎవరూ వాడటం లేదు. ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకంటే.. వీటిలో నల్లగడ్డం నజర్ అదే అమిత్ షా కన్ను తెలంగాణపై పడింది. ప్రధాని మోదీ రెండేళ్ల పాలన వేడుకలు జరుపుకొంటున్నవేళ ఆయన తెలంగాణపై దృష్టి పెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. మేనెల ఆఖరులో ఒకసారి, జూన్ 15 వ తేదీన మరోసారి ఆయన తెలంగాణలో పర్యటిస్తారని సమాచారం.
గ్రామాల్లో పార్టీ విస్తరణపై దృష్టి!
ప్రస్తుతం తెలంగాణ బీజేపీ కొంత నైరాశ్యంలో ఉంది. అధికార పార్టీ వరుస పెట్టి చేస్తోన్న విమర్శలతో రాష్ట్ర శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. విమర్శలను తిప్పికొడుతున్నా… టీఆర్ ఎస్ నేతలకు మాటల్లో ఉన్న పదును, వేగం బీజేపీలో లేవనే చెప్పాలి. సాక్షత్తూ కేసీఆరే కమలనాథులను తూర్పారబడుతుంటే.. సమర్థంగా తిప్పికొట్టలేకపోతున్నారన్న ది వాస్తవం. అయితే, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా పర్యటన రాష్ట్ర కేడర్‌లో ఉత్సాహం నింపుతారని అగ్రనాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అమిత్‌షా పర్యటన గ్రామాలను లక్ష్యంగా చేసుకుని సాగడం గమనార్హం. కిసాన్ బీమా పథకం ప్రయోజనాలను , కేంద్ర పథకాలను, నరేంద్రమోదీ పాలనను, రైతులకు వివరించి వారిని ఆకర్షించాలన్నది వీరి లక్ష్యంగా తెలుస్తోంది. ఊరూరా బీజేపీ – ఇంటింటా మోదీ అనే నినాదంతో దాదాపు 8 బృందాలు గ్రామాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నాయని సమాచారం. వీరితోపాటు పలువురు కేంద్రమంత్రులు, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర వర్గ నాయకులు అంతా పాల్గొంటున్నారు.
Advertisement