విస్తరణ కాదు.. శాఖల మార్పే
కొంతకాలంగా తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ జరుగుబోతోందంటూ వచ్చిన ఊహాగానాలకు సీఎం కేసీఆర్ సోమవారంతో తెరదించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ దఫా మంత్రి వర్గ విస్తరణ ఉండకపోవచ్చు. కేవలం కొన్ని శాఖల్లో మార్పులుమాత్రమే ఉండనున్నాయి. కేటీఆర్, జూపల్లి, తలసాని శ్రీనివాస్ యాదవ్ శాఖల్లో మార్పులు తథ్యమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆదివారం రాత్రి సీఎం కే సీఆర్ శాఖల మార్పులపై కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఎవరికి ఏశాఖలు..? ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలతోపాటు […]
Advertisement
కొంతకాలంగా తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ జరుగుబోతోందంటూ వచ్చిన ఊహాగానాలకు సీఎం కేసీఆర్ సోమవారంతో తెరదించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ దఫా మంత్రి వర్గ విస్తరణ ఉండకపోవచ్చు. కేవలం కొన్ని శాఖల్లో మార్పులుమాత్రమే ఉండనున్నాయి. కేటీఆర్, జూపల్లి, తలసాని శ్రీనివాస్ యాదవ్ శాఖల్లో మార్పులు తథ్యమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆదివారం రాత్రి సీఎం కే సీఆర్ శాఖల మార్పులపై కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
ఎవరికి ఏశాఖలు..?
ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలతోపాటు మునిసిపల్ శాఖ బాధ్యతలను కూడా మంత్రి కేటీఆరే పర్యవేక్షిస్తున్నారు. పరిశ్రమల శాఖకు మంత్రిగా ఉన్న జూపల్లి క్రిష్ణారావుకు వ్యవహరిస్తున్నారు. ఇక తలసాని వాణిజ్య పన్నులతోపాటు, సినిమాటోగ్రఫీ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. తాజా మార్పుల్లో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖను జూపల్లికి బదలాయించి, ఆయన వద్దనున్న పరిశ్రమల శాఖను కేటీర్ కి కేటాయించనున్నారు. ఇక తలసాని వద్ద నుంచి వాణిజ్య పన్నులశాఖను తప్పించనున్నారు. ఆయనకు సినిమాటోగ్రఫీ బాధ్యతలు ఉంచుతూనే.. కొత్తగా బీసీ సంక్షేమ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇకపోతే మిషన్ భగీతథ కోసం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీనికి స్వయంగా ఆయనే నేతృత్వం వహించనున్నట్లు తెలిసింది. తెలంగాణలో ప్రతి ఇంటికీ.. తాగునీటి ఇచ్చే ప్రతిష్టాత్మక పథకం కావడంతో కేసీఆరే ఈ శాఖను పర్యవేక్షించనున్నారని సమాచారం.
Advertisement