కాంగ్రెస్‌లో సమన్వయ మంటలు
అసలే సమన్వయ లోపం, అంతర్గత కలహాలతో కాపురం సాగిస్తున్న.. కాంగ్రెస్ పార్టీలో మరో చిచ్చు రేగింది. అదే సమన్వయ కమిటీ ఏర్పాటు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సమన్వయ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసింది. అందులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 మంది నాయకులకు చోటు కల్పించింది. దీనిపై పలువురు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా సమన్వయ కమిటీ అంటే.. ఐదుగురు లేదా ఆరుగురుకు మించ కూడదు. కానీ, తెలంగాణలో విచిత్రంగా.. 31 మందికి చోటు […]
Advertisement
అసలే సమన్వయ లోపం, అంతర్గత కలహాలతో కాపురం సాగిస్తున్న.. కాంగ్రెస్ పార్టీలో మరో చిచ్చు రేగింది. అదే సమన్వయ కమిటీ ఏర్పాటు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సమన్వయ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసింది. అందులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 మంది నాయకులకు చోటు కల్పించింది. దీనిపై పలువురు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా సమన్వయ కమిటీ అంటే.. ఐదుగురు లేదా ఆరుగురుకు మించ కూడదు. కానీ, తెలంగాణలో విచిత్రంగా.. 31 మందికి చోటు కల్పించడంపై తెలంగాణ నాయకులు విస్మయంతోపాటు, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. పరిమితమైన సంఖ్యలో ఉంటే దాన్ని సమన్వయ కమిటీ అంటారు.. గానీ, 31 మందితో జంబో కమిటీని తయారు చేసి దానికి సమన్వయ కమిటీ అని పేరు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.
నాయకులు జారిపోకుండా ఉండేందుకే..!
సమన్వయ కమిటీలో 31 మంది నాయకులకు సభ్యత్వం కల్పించడంపై ఎంపీ వీహెచ్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఆయన అంటున్నారు. వాస్తవానికి వీహెచ్ చెప్పింది నిజమే! ఇలాంటి భారీ కమిటీలో అంతా ఒకే అభిప్రాయానికి రావడం దాదాపుగా అసాధ్యమే అని చెప్పుకోవాలి. అధిష్టానం సమన్వయ కమిటీలో ఇంతమందిని చేర్చడం వెనక అసలు రహస్యం ఏంటంటే.. ప్రస్తుతం అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులందరినీ తమ పార్టీలో చేర్చుకుంటోంది. ఇది క్రమంగా పెరిగితే..పార్టీ ఉనికి, మనుగడకు ప్రమాదం ఏర్పడతాయి. అలాంటి ఉపద్రవం ముంచుకురాకుండా ముందు జాగ్రత్తగా పార్టీ ఈ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. తద్వారా పార్టీ కార్యక్రమాలను బలోపేతం చేసి, కార్యకర్తల్లో మనోస్థైర్యం కోల్పోకుండా చేయాలన్నది దాని అభిమతం. అందుకే, అన్ని జిల్లాల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఈ జంబో కమిటీలో చోటుకల్పించారు. అదన్న మాట సంగతి!