హ‌రీష్ కోపానికి కార‌ణం ఏంటంటే ?

తెలంగాణ భారీ నీటిపారుద‌ల మంత్రి హ‌రీష్‌రావుకు కోపం వ‌చ్చింది. అధికారుల‌పై ఆయ‌న తీవ్రంగా మండ్డి ప‌డ్డారు.. ఎంత‌లా అంటే.. ఇదే నా ఆఖ‌రు హెచ్చ‌రిక అనేంత వ‌ర‌కు విష‌యం వెళ్లింది.  ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మిష‌న్ కాక‌తీయ ప‌నుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈనెల 30 నాటికి పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ప‌నులు జ‌రుగుతున్న తీరుపై అన్ని జిల్లాల అధికారుల‌తో మంత్రి  మంగ‌ళ‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఖ‌మ్మం జిల్లాలో ప‌నుల‌పై సంతృప్తి వ్య‌క్తం చేసిన ఆయ‌న మెద‌క్‌, […]

Advertisement
Update:2016-04-06 04:53 IST
తెలంగాణ భారీ నీటిపారుద‌ల మంత్రి హ‌రీష్‌రావుకు కోపం వ‌చ్చింది. అధికారుల‌పై ఆయ‌న తీవ్రంగా మండ్డి ప‌డ్డారు.. ఎంత‌లా అంటే.. ఇదే నా ఆఖ‌రు హెచ్చ‌రిక అనేంత వ‌ర‌కు విష‌యం వెళ్లింది. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మిష‌న్ కాక‌తీయ ప‌నుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈనెల 30 నాటికి పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ప‌నులు జ‌రుగుతున్న తీరుపై అన్ని జిల్లాల అధికారుల‌తో మంత్రి మంగ‌ళ‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఖ‌మ్మం జిల్లాలో ప‌నుల‌పై సంతృప్తి వ్య‌క్తం చేసిన ఆయ‌న మెద‌క్‌, నిజామాబాద్‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌ల‌లో ప‌నుల జాప్యంపై తీవ్రంగా స్పందించారు. ఇదే చెప్ప్తున్నా.. మీకు ఇదే నా లాస్ట్ వార్నింగ్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ.. నెలాఖ‌రుకు ప‌నులు పూర్తికావాలి అని ఆదేశించారు. అలా కాని ప‌క్షంలో తీవ్ర చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. తానే స్వ‌యంగా ప్ర‌తి జిల్లాల్లో చెరువుల‌న్నింటినీ ప‌రిశీలించి ప‌నుల‌ను ప‌రిశీలిస్తాన‌న్నారు. నిర్ల‌క్ష్యం, నిర్లిప్త‌త‌ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌హించేది లేద‌న్నారు.
విష‌యం ఏంటంటే..?
ఇంత‌కీ హ‌రీష్‌రావుకు అంత‌లా కోపం రావ‌డానికి కార‌ణ‌మం ఏంటంటే.. ఈ ప‌నుల‌ను స్వ‌యంగా సీఎం కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్నారు. ఇటీవ‌ల కాలంలో ప‌నులు నెమ్మ‌దించిన విష‌యం సీఎం చెవిన ప‌డింది. ఈ విష‌యం తెలుసుకున్న ఆయ‌న ప‌నులు జరుగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారంట‌. అందుకే, హ‌రీష్ అధికారుల‌పై మండిప‌డ్డారు. అదీ అస‌లు విషయం!

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News