మేనమామ అన్న భయం కూడా లేదా?
అనంతపురం వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి వర్గీయులు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సమక్షంలోనే రచ్చరచ్చ చేశారు. రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఏమీ చేయలేకపోయారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైఎస్‌ఆర్ ట్రేడ్ యూనియన్ కూడా బరిలో దిగుతోంది. ఎన్నికల సమయత్తంలో భాగంగా రవీంద్రనాథ్ రెడ్డి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం వచ్చిన రవీంద్రనాథరెడ్డి పార్టీ ముఖ్యలతో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. జిల్లా వైసీపీ ట్రేడ్ యూనియన్‌కు గౌరవాధ్యక్షుడిగా […]
అనంతపురం వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి వర్గీయులు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సమక్షంలోనే రచ్చరచ్చ చేశారు. రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఏమీ చేయలేకపోయారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైఎస్‌ఆర్ ట్రేడ్ యూనియన్ కూడా బరిలో దిగుతోంది. ఎన్నికల సమయత్తంలో భాగంగా రవీంద్రనాథ్ రెడ్డి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం వచ్చిన రవీంద్రనాథరెడ్డి పార్టీ ముఖ్యలతో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.
జిల్లా వైసీపీ ట్రేడ్ యూనియన్‌కు గౌరవాధ్యక్షుడిగా ఉన్న గురునాథరెడ్డిని కూడా సమావేశానికి ఆహ్వానించారు. అయితే ఆయన రాలేదు. అయినప్పటికీ సమావేశం కొనసాగింది. సమావేశంలో అనంతపురం డిపో వైసీపీ ట్రేడ్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా రాజీవ్ రెడ్డిని కొత్తగా ఎన్నుకున్నారు. విషయం తెలుసుకున్న గురునాథరెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పెద్దెత్తున నినాదాలు చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న గురునాథరెడ్డిని పక్కన పెట్టి రాజీవ్ రెడ్డిని ఎలా గౌరవాధ్యక్షుడిని చేస్తారంటూ అరుపులు కేకలు వేశారు. టీడీపీ కోవర్టులకు పదవులిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సమక్షంలోనే గురునాథరెడ్డి వర్గీయులు ఇంత రభస చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గురునాథరెడ్డి మాత్రం వారిని వారించే ప్రయత్నం చేయలేదు.
Click on image to Read