ముద్రగడపైనా ఆరోపణలు చేసిన టీడీపీ మంత్రులు

కాపునాయకుడు ముద్రగడ పద్మనాభంపై ఏపీ కాపు మంత్రులు ఎదురుదాడి చేశారు. హోంమంత్రి చినరాజప్ప, మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ కాపులను ముద్రగడ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కాపు రిజర్వేషన్లపై జీవో ఇస్తే కోర్టులో అది నిలబడదన్నారు. దీక్షల పేరుతో బ్లాక్‌మెయిల్ చేయడం ముద్రగడకు అలవాటేనని చినరాజప్ప విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై కమిషన్ వేశామని 9 నెలల్లో నివేదిక వస్తుందన్నారు. నివేదిక వచ్చిన తర్వాతే రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామని హోంమంత్రి చెప్పారు. అంతవరకు ఆగలేరా అని ప్రశ్నించారు. గతంలో మంత్రిగా […]

Advertisement
Update:2016-02-01 09:58 IST

కాపునాయకుడు ముద్రగడ పద్మనాభంపై ఏపీ కాపు మంత్రులు ఎదురుదాడి చేశారు. హోంమంత్రి చినరాజప్ప, మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ కాపులను ముద్రగడ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కాపు రిజర్వేషన్లపై జీవో ఇస్తే కోర్టులో అది నిలబడదన్నారు. దీక్షల పేరుతో బ్లాక్‌మెయిల్ చేయడం ముద్రగడకు అలవాటేనని చినరాజప్ప విమర్శించారు.

కాపు రిజర్వేషన్లపై కమిషన్ వేశామని 9 నెలల్లో నివేదిక వస్తుందన్నారు. నివేదిక వచ్చిన తర్వాతే రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామని హోంమంత్రి చెప్పారు. అంతవరకు ఆగలేరా అని ప్రశ్నించారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో కాపులకు ముద్రగడ ఏం చేశారని ప్రశ్నించారు. మంత్రిగా ఉన్న సమయంలో కాపులకు ప్రవేశం లేదంటూ చాంబర్ ముందు ముద్రగడ బోర్డు పెట్టించారని చినరాజప్ప ఆరోపించారు.

తుని విధ్వంసం వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందని ప్రచారం చేయవద్దని ముద్రగడను హెచ్చరిస్తున్నామని హోంమంత్రి అన్నారు. 15 రోజుల క్రితం వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి ముద్రగడను కలిసి డబ్బు అప్పగించారని హోంమంత్రి ఆరోపించారు. ముద్రగడ వెనుక వైసీపీ నేతలున్నారని మండిపడ్డారు.

రైల్‌రోకో, రాస్తారోకో చేయాలని ముద్రగడ పద్మనాభం అప్పటికప్పుడు మాత్రమే పిలుపు ఇచ్చారని… ఆయన రెచ్చగొట్టేలా మాట్లాడటం వల్లనే ఈ ఘటనలు మంత్రి నారాయణ మండిపడ్డారు. అయితే చంద్రబాబు, హోంమంత్రి తుని విధ్వంసం వెనుక వైసీపీ హస్తముందని ఆరోపించగా… మంత్రి నారాయణ మాత్రం అప్పటికప్పుడు ముద్రగడ రెచ్చగొట్టడం వల్లే పరిస్థితి చేయి దాటిపోయిందని చెప్పడం విశేషం.

Click on Image to Read:

 

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News