కాపులపై బాబు కొత్త అస్త్రం, మధ్యలో వి.వి. వినాయక్
ఈనెల 31న కాపు గర్జనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తుని వేదికగా కాపు సత్తా చాటేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఈ కాపు గర్జన సభ చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా జరుగుతోంది అన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు జాతివారు కాపు జాతి నాశనం కోసం ప్రయత్నిస్తున్నారంటూ ముద్రగడ బహిరంగ లేఖ కూడా రాశారు. సో… కాపు గర్జన ముమ్మాటికి చంద్రబాబుకు వ్యతిరేకంగానే సాగుతుంది. […]
ఈనెల 31న కాపు గర్జనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తుని వేదికగా కాపు సత్తా చాటేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఈ కాపు గర్జన సభ చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా జరుగుతోంది అన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు జాతివారు కాపు జాతి నాశనం కోసం ప్రయత్నిస్తున్నారంటూ ముద్రగడ బహిరంగ లేఖ కూడా రాశారు. సో… కాపు గర్జన ముమ్మాటికి చంద్రబాబుకు వ్యతిరేకంగానే సాగుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన వ్యూహాలకు పదును పెట్టారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు రంగంలోకి కాపు నేతలను దింపుతున్నారు.
పవర్స్ లేకున్నా హోంమంత్రిగా కాలం నెగ్గుకొస్తున్న చినరాజప్పపై బాధ్యత మోపారు. ఎమ్మెల్యే బొండా ఉమాతో పాటు మరికొందరిని పురామాయించారు. వీరి చేయాల్సి పని ఒక్కటే. కాపు గర్జన సభ తీవ్రతను వీలైనంత వరకు తగ్గించడం. అంటే చంద్రబాబు కాపులకు ఎంతో మేలు చేశారని కొందరి (ముద్రగడ వంటివారు) మాటలు విని మోసపోవద్దని కాపు యువతను ఈ నేతలు చైతన్యపరుస్తారట. ఇటీవల పార్టీ నేతలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలోనే ఈమేరకే చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కాపు గర్జనకు సంఘీభావం ప్రకటించిన వైసీపీని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయాలని కాపు నేతలకు సూచనలు అందాయని చెబుతున్నారు.
అందులో భాగంగానే కాపు నేత రామాంజనేయులు జగన్ సామాజికవర్గం కాపులను అణచివేస్తోందని ఆరోపణ చేశారు. సాధారణంగా అయితే రామాంజనేయులు మాటలకు మీడియా అంత ప్రాధాన్యత ఇవ్వదు. కానీ కాపు గర్జన నేపథ్యంలో టీడీపీ అనుకూల మీడియా సంస్థలు రామాంజనేయులు మాటలను పెద్దెత్తున ప్రచారం చేశాయి. కాపులంతా జగన్‌పై ఆగ్రహంగా ఉన్నారన్న రేంజ్‌లో కలర్ అద్ది కథనాలు వేశారు. దర్శకుడు వీవీ వినాయక్‌ను కూడా టీడీపీ అనుకూల మీడియా చాలా తెలివిగా వాడేసింది. ఇటీవల గోదావరి జిల్లాలో కాపు కులస్తులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోగా అదే సామాజికవర్గానికి చెందిన వివి వినాయక్ కూడా హాజరయ్యారు. ఆ సమావేశంలో హోంమంత్రి చినరాజప్ప వేదికెక్కి కాపులకు టీడీపీ ఆవశ్యకతను వివరించారు. ఆ సమయంలో వివి వినాయక్ కూడా వేదికపై కూర్చుని ఉన్నారు. అంతే వివి వినాయక్ కూడా టీడీపీకి అనుకూలం అన్నట్టు ప్రచారం మొదలుపెట్టారు. కానీ రాజకీయాలకు, ఆ సమయంలో అక్కడ కూర్చున్న వివి వినాయక్‌కు ఎలాంటి సంబంధం లేదు. అదన్న మాట కాపు గర్జన ప్రభావం తగ్గించేందుకు చాణిక్య చంద్రబాబు వేసిన ఎత్తు.