లావ‌ణ్య  త్రిపాఠి ని టార్గెట్ చేశారు..!

అందాల రాక్షసి సినిమాతో తెలుగుతెరపై అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి… ఆ సినిమాలో చిలిపిదనం నిండిన అమాయకత్వం పాత్రలో నటించి సినీజనాలను బాగానే ఆకట్టుకుంది. మొదటి సినిమాలో కేవలం నటనకే ప్రాధ్యానత ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సినిమాల్లో గ్లామర్‌ను కూడా మిక్స్ చేయడం షురూ చేసింది. లావణ్యలో విషయం ఉందని గ్రహించిన టాలీవుడ్ దర్శకనిర్మాతలు.. మంచి సినిమాలు ఆఫర్ చేసి ఎంకరేజ్ చేశారు. ఇక గత ఏడాది చిన్నచిత్రంగా విడుదలై పెద్ద విజయం సాధించిన భలే […]

Advertisement
Update:2016-01-20 00:39 IST

అందాల రాక్షసి సినిమాతో తెలుగుతెరపై అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి… ఆ సినిమాలో చిలిపిదనం నిండిన అమాయకత్వం పాత్రలో నటించి సినీజనాలను బాగానే ఆకట్టుకుంది. మొదటి సినిమాలో కేవలం నటనకే ప్రాధ్యానత ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సినిమాల్లో గ్లామర్‌ను కూడా మిక్స్ చేయడం షురూ చేసింది. లావణ్యలో విషయం ఉందని గ్రహించిన టాలీవుడ్ దర్శకనిర్మాతలు.. మంచి సినిమాలు ఆఫర్ చేసి ఎంకరేజ్ చేశారు. ఇక గత ఏడాది చిన్నచిత్రంగా విడుదలై పెద్ద విజయం సాధించిన భలే భలే మగాడివోయ్ సినిమా.. అమ్మడి కెరీర్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఇక సంక్రాంతి సీజన్‌కి వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సైతం హిట్ టాక్ తెచ్చుకోవడంతో.. ఇప్పుడు టాలీవుడ్ హాట్ కేక్‌గా మారింది ఈ నాజూకు భామ.

ఒక్క హిట్‌తో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున సినిమాలో ఛాన్స్ పట్టేసిన లావణ్య.. నయా మూవీలో మరింత సెక్సీగా నటించింది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో ఈ ముద్దుగుమ్మ అందాలు.. తెలుగు సినీజనాలకు కిర్రెక్కిస్తున్నాయి. ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోవడంతో.. అమ్మడిని ఇప్పుడంతా గోల్డెన్ లెగ్ అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారట. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్లు అకౌంట్‌లో వేసుకోవడంతో.. లావణ్య.. స్టార్ హీరోయిన్ లీగ్ లోకి చేరడానికి ఎంతో దూరం లేదని సినీజనాలు మాట్లాడుకుంటున్నారు. ఈ నెలాఖరులో రాబోతున్న ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ సినిమా కూడా సక్సెస్ అయితే.. అమ్మడి దశ తిరిగినట్లే అని జోస్యం చెపుతున్నారు. మరి వరుస హిట్లతో గోల్డెన్ లెగ్ అని కాంప్లిమెంట్స్ అందుకుంటున్న లావణ్య త్రిపాఠి.. అప్ కమింగ్ మూవీతో కూడా లక్కీగాళ్ అనిపించుకుంటుందేమో. వ‌ర‌స‌గా రెండు , మూడు సినిమాలు హిట్ అయితే గోల్డెన్ లెగ్ అంటూ స్టాంప్ వేయ‌డం. అదే ఫెయిల్ అయితే ఐర‌న్ లెగ్ అని ముద్ర వేయ‌డం చేస్తుంటారు. గోల్డెన్ లెగ్ అనేది బాగానే వుంటుంది కానీ..ఐర‌న్ లెగ్ అంటే కెరీర్ ముగిసిన‌ట్లే. సినిమా స‌క్సెస్ అనేది టీమ్ వ‌ర్క్. ఈ విష‌యం ఎందుకు మ‌రిచిపోతారో కొంద‌రికి అర్దం కాదు.

Tags:    
Advertisement

Similar News