తండ్రి ఆటో డ్రైవర్- కొడుకు వెయ్యి పరుగుల మొనగాడు

క్రికెట్‌లో పరుగుల సునామీ. ధ్వంసం చేయడానికి కూడా సాహసించలేని రికార్డు. ఒక ఆటో డ్రైవర్ కొడుకు నెలకొల్పాడు. 15 ఏళ్ల ముంబై కుర్రాడు ప్రణవ్ సృష్టించిన పరుగుల ప్రవాహంతో క్రీడాప్రాంగణం తడిసిముద్దయింది. వెయ్యి పరుగులు చేసి నాట్ ఔట్‌గా నిలిచాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నీలో ప్రణవ్ ఈ ఘనత సాధించాడు. కేసీ గాంధీ స్కూల్‌ తరపున ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా బరిలో దిగిన ప్రణవ్ తొలి బంతి నుంచి విధ్వంసం సృష్టించాడు. 323 […]

Advertisement
Update:2016-01-05 09:55 IST

క్రికెట్‌లో పరుగుల సునామీ. ధ్వంసం చేయడానికి కూడా సాహసించలేని రికార్డు. ఒక ఆటో డ్రైవర్ కొడుకు నెలకొల్పాడు. 15 ఏళ్ల ముంబై కుర్రాడు ప్రణవ్ సృష్టించిన పరుగుల ప్రవాహంతో క్రీడాప్రాంగణం తడిసిముద్దయింది. వెయ్యి పరుగులు చేసి నాట్ ఔట్‌గా నిలిచాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నీలో ప్రణవ్ ఈ ఘనత సాధించాడు. కేసీ గాంధీ స్కూల్‌ తరపున ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా బరిలో దిగిన ప్రణవ్ తొలి బంతి నుంచి విధ్వంసం సృష్టించాడు. 323 బంతులు ఆడి ఏకంగా 1009 పరుగులు చేశాడు. 129 ఫోర్లు, 59 సిక్స్‌లు బాదేశాడు. 1899లో ఆర్థర్ కోలిన్స్ పేరు మీద ఉన్న 628 పరుగుల రికార్డు ప్రణవ్ దెబ్బకు గాలిలో కలిసిపోయింది. 1465 పరుగుల వద్ద ప్రణవ్ తరుపు జట్టు డిక్లేర్ చేయడంతో అవతలి టీం ఊపిరి పీల్చుకుంది.

తన కుమారుడు వెయి పరుగుల సాధించిన మొనగాడిగా నిలవడంతో అతడి తండ్రి ప్రశాంత్ ఆనందానికి అవధుల్లేవు. తన కుమారుడు భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టిస్తాడన్న ధీమా వ్యక్తం చేశారు. స్పాన్సర్లు ముందుకు వస్తే తమవాడి క్రికెట్ భవిష్యత్తుకు మరింత మంచి చేసిన వారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో విషయం ఏమిటంటే ప్రణవ్, సచిన్ కుమారుడు అర్జున్ ఇద్దరూ స్నేహితులు.

Tags:    
Advertisement

Similar News