సోష‌ల్ మీడియాలో ఎదురులేని మోదీ

ఈ ప్ర‌పంచంలో సోష‌ల్ మీడియాను స‌మ‌ర్ధంగా వాడ‌టం తెలిసిన నేత ఒక న‌రేంద్ర మోదీనే అంటే అతిశ‌యోక్తి కాదు. దాదాపు ఇప్పుడు న‌డుస్తోన్న అన్ని సోష‌ల్ మీడియాల్లోనూ ఆయ‌న‌కు ఖాతా ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న కార్య‌క‌లాపాల‌ను, సందేశాల‌ను, సంతాపాల‌ను వాటి ద్వారా త‌న ఫాలోవ‌ర్ల‌కు తెలియ‌జేస్తూనే ఉంటారు. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ ఇలా అన్ని ర‌కాల మీడియాలు మ‌న ప్ర‌ధానికి కొట్టిన‌పిండి. సెల్ఫీలు దిగ‌డంలో మోదీ దేశంలోని అంద‌రి రాజ‌కీయ నాయ‌కుల‌కంటే ముందే ఉంటారన‌డం అతిశ‌యోక్తి కాదు. […]

Advertisement
Update:2015-12-08 00:32 IST
ఈ ప్ర‌పంచంలో సోష‌ల్ మీడియాను స‌మ‌ర్ధంగా వాడ‌టం తెలిసిన నేత ఒక న‌రేంద్ర మోదీనే అంటే అతిశ‌యోక్తి కాదు. దాదాపు ఇప్పుడు న‌డుస్తోన్న అన్ని సోష‌ల్ మీడియాల్లోనూ ఆయ‌న‌కు ఖాతా ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న కార్య‌క‌లాపాల‌ను, సందేశాల‌ను, సంతాపాల‌ను వాటి ద్వారా త‌న ఫాలోవ‌ర్ల‌కు తెలియ‌జేస్తూనే ఉంటారు. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ ఇలా అన్ని ర‌కాల మీడియాలు మ‌న ప్ర‌ధానికి కొట్టిన‌పిండి. సెల్ఫీలు దిగ‌డంలో మోదీ దేశంలోని అంద‌రి రాజ‌కీయ నాయ‌కుల‌కంటే ముందే ఉంటారన‌డం అతిశ‌యోక్తి కాదు. అందుకేనేమో అమెరికా అధ్య‌క్షుడు ఒబామా మ‌న ప్ర‌ధానిని డిజిటల్ పీఎం అని అభివ‌ర్ణించారు.
ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్ల‌లో మూడోస్థానం!
తాజాగాసోష‌ల్‌ మీడియా ఫోరం ఇండియాలో ప్ర‌ముఖుల ట్విట్ట‌ర్ ఖాతాల వివ‌రాలను విడుద‌ల చేసింది. ఇందులో మోదీ మూడోస్థానం ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. తాజా గ‌ణాంకాల ప్ర‌కారం.. మోదీకి ప్ర‌స్తుతం 1.64 కోట్ల‌మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. మోదీ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించే స‌మ‌యానికి ఆయ‌న ఫాలోవ‌ర్ల సంఖ్య కేవ‌లం 40 ల‌క్ష‌లు. గ‌త 18 నెల‌ల కాలంలో ఆయ‌న ఫాలోవ‌ర్లు దాదాపు 4 రెట్లు పెర‌గ‌డం విశేషం.బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ (1,81కోట్లు) బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ (1.65కోట్లు) త‌రువాత మోదీ మూడో స్థానంలో కొన‌సాగుతున్నారు. ఆమీర్‌ఖాన్‌, స‌ల్మాన్ ఖాన్‌, దీపికా ప‌డ‌కోనె, హృతిక్ రోష‌న్‌, ప్రియాంక‌చోప్రా, అక్ష‌య్‌కుమార్‌, ఏఆర్ ర‌హ‌మాన్ టాప్ 10 జాబితాలో ఉన్నారు. వీరంద‌రిలో మోదీ ఒక్క‌డే రాజకీయ నాయ‌కుడు విశేషం.
Tags:    
Advertisement

Similar News