బాగుండటం....అంటే ఎంటో తెలుసా?
తెలిసినవారు ఎవరైనా కొంత విరామం తరువాత ఎదురుపడితే మనం అడిగే మొదటి ప్రశ్న…బాగున్నారా…అని. ఈ ప్రశ్న చిన్నగానే ఉన్నా, నిజానికి ఆరోగ్యం, ఆనందం, చురుకుదనం…ఇంకా ఇలాంటి పాజిటివ్ పాయింట్లు ఎన్నో కలిస్తే కానీ అది పూర్తిగా బాగుండటం అవదు. కానీ మనలో చాలామంది శరీరంలో ఏ నొప్పులూ లేకుండా, ఒక్కోసారి నొప్పులు ఉన్నా కాస్త నడుస్తూ, తమ పనులు తాము చేసుకోగలిగితే చాలు… బాగున్నట్టే అనుకుంటారు. ఇంతకీ బాగుండటం అనే పదానికి వైద్యులు ఇచ్చే నిర్వచనం ఎలా […]
తెలిసినవారు ఎవరైనా కొంత విరామం తరువాత ఎదురుపడితే మనం అడిగే మొదటి ప్రశ్న…బాగున్నారా…అని. ఈ ప్రశ్న చిన్నగానే ఉన్నా, నిజానికి ఆరోగ్యం, ఆనందం, చురుకుదనం…ఇంకా ఇలాంటి పాజిటివ్ పాయింట్లు ఎన్నో కలిస్తే కానీ అది పూర్తిగా బాగుండటం అవదు. కానీ మనలో చాలామంది శరీరంలో ఏ నొప్పులూ లేకుండా, ఒక్కోసారి నొప్పులు ఉన్నా కాస్త నడుస్తూ, తమ పనులు తాము చేసుకోగలిగితే చాలు… బాగున్నట్టే అనుకుంటారు. ఇంతకీ బాగుండటం అనే పదానికి వైద్యులు ఇచ్చే నిర్వచనం ఎలా ఉంటుంది. ఏ లక్షణాలు మనిషిని ఆరోగ్యవంతుడని చెబుతాయి…ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ అంశాలు-
- గాఢంగా నిద్రపోగలగాలి, ఉదయం నిద్రలేవగానే శక్తిమంతంగా, ఉల్లాసంగా అనిపించాలి.
- మలబద్దకం లేని సాఫీ విరేచనం అవ్వాలి.
- రోజంతా ఒకేస్థాయిలో ఉత్సాహంగా పనిచేయాలి.
- పొట్ట లోతుగా ఛాతీ ఉన్నతంగా ఉండాలి.
- ఒక్క దురలవాటు, వ్యసనం కూడా ఉండకూడదు.
- స్థిరంగా ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలగాలి.
- అలసట లేకుండా గంటలకొద్దీ పనిచేయగలగాలి.
- కొత్త విషయాలు తెలుసుకోవడం, నేర్చుకోవడంలో బద్దకం, భయం ఉండకూడదు.
- ముఖంలో మెరుపు ఉండాలి.
- కళ్లలో వెలుగు, నిర్భయత్వం కనిపించాలి.
- ముఖంమీద చిరునవ్వు చెదరకూడదు.
- వయసు మీరినా ఆ ఫీలింగ్ రాకూడదు, ఎల్లప్పుడూ నూతన శక్తితో కళకళలాడుతూ కనిపించాలి.
- కాలాన్ని దుర్వినియోగం చేయకుండా ఏదో ఒక ఉత్పాదకతనిచ్చే పని చేయగలగాలి. ఆలోచనలు సైతం అలాగే ఉండాలి.
- శరీరం ఎలాంటి సమస్యలు లేకుండా సక్రమంగా పనిచేయాలి.
- మృదువుగా మాట్లాడాలి.
అమ్మో…బాగుండటంలో ఇంత మహాభారతం ఉందా అనిపిస్తోంది కదూ. నిజానికి ఈ లక్షణాలన్నీ ఉంటేనే బాగున్నట్టు అయితే ఈ ప్రపంచంలో ఏ మనిషీ సంపూర్ణ ఆరోగ్యవంతుడు కానట్టే అనుకోవాలి. అలాగే ఈ లక్షణాల్లో ఏ కొన్ని లేకపోయినా అది ఆ మనిషి జీవితం మీదే కాదు, అతని చుట్టూ ఉన్న సమాజంమీద కూడా ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఈ బాగుండటంలో దాగి ఉన్న అంశాల్లో వ్యక్తి ఆరోగ్యమే కాక సామాజిక ఆరోగ్యమూ మిళితమై ఉందన్నమాట.