ఇద్దరి మధ్య నలిగిపోతున్న బాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్దచిక్కొచ్చి పడింది. తన కార్యక్రమాలను కవర్ చేసే విషయంలో రెండు చానళ్లు పోటీపడుతుండడంతో చంద్రబాబు తలపట్టుకుంటున్నారు. రెండు చానళ్లలో ఒకటి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కాగా… మరొకటి కేంద్రమంత్రి సుజనాచౌదరికి చెందిన మహాటీవీ. ప్రభుత్వ కవరేజ్ హక్కుల కోసం అటు రాధాకృష్ణ, ఇటు సుజనా ఇద్దరూ కూడా వెనక్కు తగ్గడం లేదు. ట్విస్ట్ ఏంటంటే సుజనా చానల్‌కు లోకేష్ బాబు సపోర్టు చేయడం. ఇటీవల టీడీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వం కార్యక్రమాలను, తన ప్రొగ్రామ్‌లను […]

Advertisement
Update:2015-11-14 12:38 IST

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్దచిక్కొచ్చి పడింది. తన కార్యక్రమాలను కవర్ చేసే విషయంలో రెండు చానళ్లు పోటీపడుతుండడంతో చంద్రబాబు తలపట్టుకుంటున్నారు. రెండు చానళ్లలో ఒకటి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కాగా… మరొకటి కేంద్రమంత్రి సుజనాచౌదరికి చెందిన మహాటీవీ. ప్రభుత్వ కవరేజ్ హక్కుల కోసం అటు రాధాకృష్ణ, ఇటు సుజనా ఇద్దరూ కూడా వెనక్కు తగ్గడం లేదు. ట్విస్ట్ ఏంటంటే సుజనా చానల్‌కు లోకేష్ బాబు సపోర్టు చేయడం.

ఇటీవల టీడీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వం కార్యక్రమాలను, తన ప్రొగ్రామ్‌లను కవర్ చేసే అవకాశాన్ని ఏబీఎన్‌కు చంద్రబాబు అప్పగించారు. ఇందుకు నెలకు దాదాపు 50 లక్షల వరకు ప్రభుత్వం చెల్లిస్తున్నట్టు సమాచారం . అసెంబ్లీ సమావేశాలను కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతే కవర్ చేస్తూ వచ్చింది. అయితే ఇటీవల రేసులోకి మహాటీవీ వచ్చింది. తమ చానల్‌ కూడా టీడీపీకి అనుకూలమే కదా తమకూ ప్రభుత్వ కార్యక్రమాల కవరేజ్‌లో అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ముందు సుజనా డిమాండ్ పెట్టారు. దీంతో దిక్కుతోచని చంద్రబాబు కొద్ది రోజుల పాటు కార్యక్రమాలను రెండు చానళ్లకు ఫిప్టీ ఫిప్టీ అంటూ అప్పగించారు. అయితే ఈ ఒప్పందం కూడా బెడిసికొట్టింది. దీంతో ప్రస్తుతం కవరేజే నిలిపివేశారు.

అయినా సరే మహాటీవీ వెనక్కు తగ్గడం లేదు. ఉచితం అంటూ ప్రభుత్వ కార్యక్రమాలకు లైవ్ కవరజ్ ఇస్తోంది. దీంతో సమస్య ఎంత దూరం వెళ్తుందోనని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. లోకేష్ బాబు … సుజనాచౌదరి చానల్‌కు మద్దతు పలకడంపై కొందరు నేతలు కంగారుపడుతున్నారు. సుజనా వద్ద చానల్ మాత్రమే ఉంది…. రాధాకృష్ణ దగ్గర చానల్‌తో పాటు పేపర్ కూడా ఉంది. ఈ సమయంలో లోకేష్ బాబు… రాధాకృష్ణకు వ్యతిరేకమైతే భవిష్యత్తులో చినబాబుకు చాలా ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఎవరికీ ఏమీ చెప్పలేక తలపట్టుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News