సీఎం అరెస్టుకు సీబీఐ వినతి!
హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్ అరెస్టుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న వీరభద్రసింగ్‌ను అరెస్టు చేసేందుకు అనుమతించాలని, అలాగే కేసును హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నుంచి ఢిల్లీకి మార్చాలని పిటిషన్‌లో కోరింది. ఆయన యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన సమయంలో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్నది సీబీఐ […]
Advertisement
హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్ అరెస్టుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న వీరభద్రసింగ్‌ను అరెస్టు చేసేందుకు అనుమతించాలని, అలాగే కేసును హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నుంచి ఢిల్లీకి మార్చాలని పిటిషన్‌లో కోరింది. ఆయన యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన సమయంలో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్నది సీబీఐ అభియోగం. ఈ పిటిషన్‌ను స్వీకరించిన హెచ్ ఎల్ దత్తు నేతృత్వంలోనే అత్యున్నత న్యాయస్థానం కేసు విచారణను దసరా సెలవుల అనంతరం ఈ నెల 26కు వాయిదా వేసింది.
Advertisement