గ"లీజు"భూముల లెక్క తీస్తున్నారు
జంటనగరాలలో లీజు భూముల భోజ్యానికి రోజులు చెల్లబోతున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి తెచ్చిన అడ్డగోలు జీవోలతో చేతులు మారిన లీజు భూములపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. వివాదాల్లో ఉన్న లీజు భూముల వివరాలూ సేకరించింది. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. నిజాం కాలం నాటి ఫైళ్లకు బూజు దులిపి లీజు లెక్కలు తవ్వితీస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని లీజు భూముల వివరాలు, సంబంధిత ఫైళ్లను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ బొజ్జా ఒక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. 2304 లీజు భూములు […]
జంటనగరాలలో లీజు భూముల భోజ్యానికి రోజులు చెల్లబోతున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి తెచ్చిన అడ్డగోలు జీవోలతో చేతులు మారిన లీజు భూములపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. వివాదాల్లో ఉన్న లీజు భూముల వివరాలూ సేకరించింది. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. నిజాం కాలం నాటి ఫైళ్లకు బూజు దులిపి లీజు లెక్కలు తవ్వితీస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని లీజు భూముల వివరాలు, సంబంధిత ఫైళ్లను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ బొజ్జా ఒక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.
2304 లీజు భూములు
దశాబ్దాల క్రిందటి లెక్కల ప్రకారం హైదరాబాద్ జిల్లాలో మొత్తం 6,500 లీజు భూములుండేవని…అడ్డగోలు జీవోలతో అన్యాక్రాంతమైపోయాయని సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చిందని సహ ఉద్యమ కార్యకర్తలు చెబుతున్నారు. చివరికి తెలంగాణ సర్కారు ఆదేశాలతో విచారణ జరిపిన అధికారులు లీజు భూములకు సంబంధించి 2304 ఫైళ్లు మాత్రమే గుర్తించగలిగారని సమాచారం.
క్రమబద్ధీకరిస్తే రూ.386 కోట్ల ఆదాయం
ఈ భూములను క్రమబద్ధీకరిస్తే ప్రభుత్వానికి రూ.386.86కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
తమ ఆధీనంలో ఉన్న లీజు భూములను తమకే క్రమబద్ధీకరించాలని లీజు భూములను అనుభవిస్తున్నవారు వాదిస్తున్నారు. ప్రభుత్వం స్థలాన్ని మాత్రమే తమకు లీజుకు ఇచ్చిందని, తాము భవనాలు నిర్మించుకున్నామని అంటున్నారు. అయితే లీజు పూర్తి కాగానే అందులో ఉన్న నిర్మాణాలు కూడా ప్రభుత్వానికే చెందుతాయని నిబంధనలు చెబుతున్నాయి. దశాబ్దాలుగా సాగిన ఈ లీజుల దందా సర్కారు చొరవతో బయటపడింది.