టీడీపీ రోగం... వైసీపీకి అంటుకుందా..?

మొన్నటి ఎన్నికలకు ముందు వైసీపీపై రకరకాల అస్త్రాలు ప్రయోగించి విజయవంతమైన టీడీపీ ఇప్పుడు కొత్త ఎత్తుగడ సిద్ధం చేసింది. అందుకు జగన్ సొంతసామాజికవర్గాన్నే అస్త్రంగా ప్రయోగిస్తోంది. తరచు ఏదో ఒక ప్రజాసమస్యపై పోరాటం చేస్తూ జగన్ అన్ని వర్గాలకు దగ్గరవుతున్నారని అంచనాకు వచ్చిన టీడీపీ అందుకు విరుగుడు మంత్రం వేస్తోంది.వైసీపీకి మిగిలిన సామాజికవర్గాలు దగ్గరవుకుండా చేసేందుకు మాస్టర్ ప్లాన్ రచించింది. ఇందులో భాగంగా వైసీపీలో కేవలం రెడ్డి సామాజికవర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని మిగిలిన సామాజిక వర్గాలకు […]

Advertisement
Update:2015-10-06 07:29 IST

మొన్నటి ఎన్నికలకు ముందు వైసీపీపై రకరకాల అస్త్రాలు ప్రయోగించి విజయవంతమైన టీడీపీ ఇప్పుడు కొత్త ఎత్తుగడ సిద్ధం చేసింది. అందుకు జగన్ సొంతసామాజికవర్గాన్నే అస్త్రంగా ప్రయోగిస్తోంది. తరచు ఏదో ఒక ప్రజాసమస్యపై పోరాటం చేస్తూ జగన్ అన్ని వర్గాలకు దగ్గరవుతున్నారని అంచనాకు వచ్చిన టీడీపీ అందుకు విరుగుడు మంత్రం వేస్తోంది.వైసీపీకి మిగిలిన సామాజికవర్గాలు దగ్గరవుకుండా చేసేందుకు మాస్టర్ ప్లాన్ రచించింది.

ఇందులో భాగంగా వైసీపీలో కేవలం రెడ్డి సామాజికవర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని మిగిలిన సామాజిక వర్గాలకు సరైన స్థానం ఉండదని ప్రచారం చేయాలని నిర్ణయించారని సమాచారం. దీన్ని ఇప్పటికే అమల్లోకి కూడా తెచ్చారు. అయితే ఈ ప్రచారం వేరే సామాజికవర్గాలతో చేయిస్తే ప్రతికూల ఫలితం రావచ్చన్న ఉద్దేశంతో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే టీడీపీ ఎంచుకుంది.

ఇందులో భాగమే సోమవారం పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి నోటి నుండి వచ్చిన మాటని చెబుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టిన లింగారెడ్డి… వైసీపీని కులాల బేస్‌ మీద టార్గెట్ చేశారు. వైసీపీ కేవలం ఒక సామాజికవర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తోందని మిగిలిన సామాజికవర్గాలకు వైసీపీలో విలువ లేదని మండిపడ్డారు. అందుకే రెండు రాష్ట్రాల్లోనూ వైసీపీకి ఒకే సామాజికవర్గం వారు అధ్యక్షులుగా ఉన్నారని విమర్శించారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టే నేతలకు అక్కడి సిబ్బందే స్ర్కిప్ట్ మొత్తం సిద్ధం చేసి ఇస్తారు. లింగారెడ్డికి కూడా కులం ఆధారంగా వైసీపీని తిట్టిపోసేలా ట్రస్ట్ భవన్‌ మేధావులు దిశానిర్దేశం చేశారని సమాచారం.

లింగారెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మరోలా స్పందిస్తున్నారు. లింగారెడ్డి మాటలకు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ కౌంటర్‌ ఇవ్వాల్సినంత సీన్‌ లేదంటూనే కొన్ని విషయాలను గుర్తు చేస్తున్నారు. వైసీపీ రెడ్డి పార్టీ అంటున్న టీడీపీ నేతలు ముందు వారి సంగతి చూసుకోవాలని అంటున్నారు. చంద్రబాబు కోటరిలో ఉండే వారంతా ఆయన సొంత సమాజికవర్గం కాదా అని ప్రశ్నిస్తున్నారు. సుజనాచౌదరి, మురళీ మోహన్, లోకేష్, కంభంపాటి, దేవినేని ఉమ, కోడెల శివప్రసాదరావు, పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు ఇలా చెబుతూపోతే కేబినెట్‌ నుంచి అన్ని పదవుల్లో చంద్రబాబు సొంత సామాజికవర్గం తప్ప మిగిలిన నేతలు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు.

అధికారంలోకి వచ్చాక పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో పాటు పలు శాఖల్లో సొంతసామాజికవర్గానికే పెద్దపీట వేస్తున్న వ్యక్తి చంద్రబాబని విమర్శిస్తున్నారు. బీసీలకు పెద్ద పీట వేస్తామంటూ గత ఎన్నికల్లో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యను ఎలా వాడుకుని వదిలేశారో అందరికీ తెలుసంటున్నారు. పేరుకు డిప్యూటీ సీఎం అయినప్పటికీ కేఈ కృష్ణమూర్తిని ఎంత దారుణంగా పదేపదే అవమానిస్తున్నారో తెలియడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కులరాజకీయాలు రెచ్చగొట్టడం మానుకోవాలని ఫ్యాన్ ఫోర్స్ సూచిస్తోంది.

Tags:    
Advertisement

Similar News