అదితి కథ విషాదాంతం... కేజీహెచ్‌కు మృతదేహం
కొద్ది రోజుల క్రితం విశాఖలో గల్లంతయిన చిన్నారి అదితి ఉదంతం విషాదాంతమైంది. అదితి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతదేహం విజయనగరం జిల్లా భోగాపురం మండలం సన్‌రే బీచ్ వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చింది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అదితి తండ్రిని పోలీసులు అక్కడికి రప్పించారు. మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా చిన్నారి తండ్రి శ్రీనివాస్ బోరున విలపించారు. డ్రస్, చెవి రింగులు, మెడలోని తాయత్తు ఆధారంగా మృతదేహం తన కూతురిదేనని శ్రీనివాస్ నిర్ధారించారు. రోజులు గడవడంతో చిన్నారి మృతదేహం […]
కొద్ది రోజుల క్రితం విశాఖలో గల్లంతయిన చిన్నారి అదితి ఉదంతం విషాదాంతమైంది. అదితి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతదేహం విజయనగరం జిల్లా భోగాపురం మండలం సన్‌రే బీచ్ వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చింది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అదితి తండ్రిని పోలీసులు అక్కడికి రప్పించారు. మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా చిన్నారి తండ్రి శ్రీనివాస్ బోరున విలపించారు. డ్రస్, చెవి రింగులు, మెడలోని తాయత్తు ఆధారంగా మృతదేహం తన కూతురిదేనని శ్రీనివాస్ నిర్ధారించారు. రోజులు గడవడంతో చిన్నారి మృతదేహం కొద్ది మేరకు డీకంపోజ్ అయింది. ఎక్కువ రోజుల పాటు నీటిలో ఉండడంతో శరీరం తెల్లగా పాలిపోయింది. విశాఖలో డ్రైనేజ్‌లోకి జారి పడి అదితి కొట్టుకోపోయింది. మున్సిపల్ సిబ్బంది, నేవీ సిబ్బందిగా భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినా అదితి అచూకీ కనిపెట్టలేకపోయారు. చివరకు చిన్నారి మృతదేహం సన్‌రే బీచ్ వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చింది.
కేజీహెచ్‌కు చేరిన అదితి మృతదేహం
అదితి మృతదేహం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కొట్టుకొచ్చిన మృతదేహం చిన్నారి అదితిగా గుర్తించామని ఏపీ శాంతిభద్రతల అడిషనల్ డీజీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. అదితి చనిపోయే ముందు వేసుకున్న దుస్తులు ఒకే రకంగా ఉండటంతో అదితిగా నిర్ధారించామని తెలిపారు. అదితి మృతదేహాన్ని తండ్రి కూడా గుర్తించారని అడిషనల్ డీజీ చెప్పారు. అదిథి మృతదేహానికి శుక్రవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహిస్తారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు అప్పగిస్తారు. విశాఖలోని పాప ఇంటి వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు, బంధువులు అంతా అక్కడకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె ముద్దుముద్దు మాటలు తలచుకుని కన్నతల్లి రోధిస్తున్న తీరు అందరినీ కలిచి వేస్తోంది.