మార్చి నుంచి సాగుకు పగటిపూట కరెంట్‌: ఈటెల

వచ్చే యేడాది మార్చి నుంచి వ్యవసాయానికి పగటిపూట కరెంట్‌ ఇస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణ రైతులకు విద్యుత్‌ కష్టాలు పూర్తిగా తీరనున్నాయని ఆయన అన్నారు. మెదక్‌ జిల్లా కల్హేర్‌లో దీపం పథకం కింద గ్యాస్‌ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మూడేళ్ల తర్వాత తెలంగాణలో విద్యుత్‌ కోతలు అనేవే లేకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో కరెంట్‌ […]

Advertisement
Update:2015-09-16 19:02 IST
వచ్చే యేడాది మార్చి నుంచి వ్యవసాయానికి పగటిపూట కరెంట్‌ ఇస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణ రైతులకు విద్యుత్‌ కష్టాలు పూర్తిగా తీరనున్నాయని ఆయన అన్నారు. మెదక్‌ జిల్లా కల్హేర్‌లో దీపం పథకం కింద గ్యాస్‌ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మూడేళ్ల తర్వాత తెలంగాణలో విద్యుత్‌ కోతలు అనేవే లేకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో కరెంట్‌ కష్టాలు పూర్తిగా తీరతాయని ఆయన తెలిపారు.
Tags:    
Advertisement

Similar News