రక్షణ బలగాల్లో మహిళలకు ప్రాధాన్యత: రాజ్‌నాథ్
రక్షణ బలగాల్లో మహిళల ప్రాధాన్యత పెంచాలని భావిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సికింద్రాబాద్ హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీలో 29వ బ్యాచ్ అడిషనల్ కమాండెంట్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో రాజ్‌నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ విచ్ఛిన్నం కోసం యత్నించే శక్తులను ఎదుర్కొనేందుకు రక్షణ బలగాలు సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. ఎప్పటికప్పుడు టెక్నాలజీని మెరుగుపర్చుకోవాలని ఆయన చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో సీఐఎస్‌ఎఫ్ సేవలు అభినందనీయమని రాజ్‌నాథ్‌సింగ్ […]
Advertisement
రక్షణ బలగాల్లో మహిళల ప్రాధాన్యత పెంచాలని భావిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సికింద్రాబాద్ హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీలో 29వ బ్యాచ్ అడిషనల్ కమాండెంట్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో రాజ్‌నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ విచ్ఛిన్నం కోసం యత్నించే శక్తులను ఎదుర్కొనేందుకు రక్షణ బలగాలు సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. ఎప్పటికప్పుడు టెక్నాలజీని మెరుగుపర్చుకోవాలని ఆయన చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో సీఐఎస్‌ఎఫ్ సేవలు అభినందనీయమని రాజ్‌నాథ్‌సింగ్ కొనియాడారు.
Advertisement