ప్రత్యేకహోదా కోసం ఆగని ఆత్మార్పణలు
ఏపీకి ప్రత్యేకహోదా కోసం నెల్లూరు జిల్లాకు చెందిన లక్ష్మయ్య ఆత్మార్పణ చేసుకున్న ఘటన మరవకముందే మరో ఇద్దరు యువకులు ఆత్మార్పణకు పాల్పడ్డారు. మరో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఉదయభాను(40) ఏపీకు ప్రత్యేక హోదా దక్కాలని కోరుతూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఒక్కటై పోరాడి ప్రత్యేకహోదా సాధించుకోవాలని తన సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలోని సి.బెళగల్‌లో గనుమాల లోకేశ్వరరావు (37) ప్రత్యేకహోదా దక్కదన్న భయంతో గుండెపోటుకు గురై […]
Advertisement
ఏపీకి ప్రత్యేకహోదా కోసం నెల్లూరు జిల్లాకు చెందిన లక్ష్మయ్య ఆత్మార్పణ చేసుకున్న ఘటన మరవకముందే మరో ఇద్దరు యువకులు ఆత్మార్పణకు పాల్పడ్డారు. మరో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఉదయభాను(40) ఏపీకు ప్రత్యేక హోదా దక్కాలని కోరుతూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఒక్కటై పోరాడి ప్రత్యేకహోదా సాధించుకోవాలని తన సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలోని సి.బెళగల్‌లో గనుమాల లోకేశ్వరరావు (37) ప్రత్యేకహోదా దక్కదన్న భయంతో గుండెపోటుకు గురై మరణించారు. ఎంటెక్ చదివిన లోకేశ్వరరావు లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ప్రత్యేకహోదా కోసం విశాఖజిల్లాకు చెందిన ధర్మిశెట్టి దేముడు (32) ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు.
Advertisement