563 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరోసారి ఏఈ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొదటి నోటిఫికేషన్‌లో 770 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ ఈసారి 563 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మీడియాతో మాట్లాడుతూ, అభ్యర్ధులు ఈనెల 29 నుంచి సెప్టెంబరు 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. అక్టోబరు 25న రాత పరీక్ష నిర్వహిస్తామని ఆయన చెప్పారు. జనరల్ […]
Advertisement
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరోసారి ఏఈ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొదటి నోటిఫికేషన్‌లో 770 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ ఈసారి 563 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మీడియాతో మాట్లాడుతూ, అభ్యర్ధులు ఈనెల 29 నుంచి సెప్టెంబరు 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. అక్టోబరు 25న రాత పరీక్ష నిర్వహిస్తామని ఆయన చెప్పారు. జనరల్ కేటగిరి అభ్యర్ధుల వయోపరిమితి 44 సంవత్సరాలు కాగా, రిజర్వేషన్లతో 58 సంవత్సరాల వయసున్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చని చక్రపాణి చెప్పారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు పరీక్షలకు వారం రోజుల ముందు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.
Advertisement