భూసేకరణపై పోరాటాలకు మద్దతు: సీపీఎం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సేకరణపై జరుగుతున్న పోరాటలకు కేంద్ర కమిటీ మద్దతు తెలిపిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. గత మూడు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న సమావేశాలు ఈ రోజు ముగిశాయి. ఆయన మాట్లాడుతూ దేశ, రాజకీయ పరిస్థితులు, కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కమిటీ సుదీర్ఘంగా చర్చించిందన్నారు. బీహార్ ఎన్నికల్లో వామపక్షాలు ఐక్యంగా పోటీ చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. రాబోయే కాలంలో వామపక్ష పార్టీలన్నీ ఒక వ్యూహాత్మంగా ముందుకెళ్లాలని కమిటీ […]

Advertisement
Update:2015-08-23 18:37 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సేకరణపై జరుగుతున్న పోరాటలకు కేంద్ర కమిటీ మద్దతు తెలిపిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. గత మూడు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న సమావేశాలు ఈ రోజు ముగిశాయి. ఆయన మాట్లాడుతూ దేశ, రాజకీయ పరిస్థితులు, కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కమిటీ సుదీర్ఘంగా చర్చించిందన్నారు. బీహార్ ఎన్నికల్లో వామపక్షాలు ఐక్యంగా పోటీ చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. రాబోయే కాలంలో వామపక్ష పార్టీలన్నీ ఒక వ్యూహాత్మంగా ముందుకెళ్లాలని కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. సెప్టెంబర్ 2న జరిగే దేశ వ్యాప్త సమ్మెకు కేంద్ర కమిటీ పూర్తి సంఘీభావాన్ని ప్రకటించిందని రాఘవులు పేర్కొన్నారు.
Tags:    
Advertisement

Similar News