హురియత్ నేతల గృహ నిర్బంధంతో ఎన్ఎస్ఏ చర్చలపై సందిగ్ధం
మరికొద్ది రోజులో ఇండియా పాక్‌ల మధ్య జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఎ) చర్చలు జరగాల్సి ఉండగా, గురువారం జమ్ము కశ్మీర్‌లో వేర్పాటువాద సంస్థలకు చెందిన హురియత్ నేతలనుపోలీసులు కొన్ని గంటల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. దీంతో ఈ రెండు దేశాల మధ్య జరగాల్సిన ఎన్ఎస్ఎ చర్చలపై సందిగ్ధం నెలకొంది. పాక్ విదేశాంగ శాఖ అధికారులు ఎన్ఎస్ఎ చర్చల కోసం ఢిల్లీ వచ్చినప్పుడు హురియత్ నేతలతో చర్చలు జరుపుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వేర్పాటు వాదులతో చర్చలను […]
Advertisement
మరికొద్ది రోజులో ఇండియా పాక్‌ల మధ్య జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఎ) చర్చలు జరగాల్సి ఉండగా, గురువారం జమ్ము కశ్మీర్‌లో వేర్పాటువాద సంస్థలకు చెందిన హురియత్ నేతలనుపోలీసులు కొన్ని గంటల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. దీంతో ఈ రెండు దేశాల మధ్య జరగాల్సిన ఎన్ఎస్ఎ చర్చలపై సందిగ్ధం నెలకొంది. పాక్ విదేశాంగ శాఖ అధికారులు ఎన్ఎస్ఎ చర్చల కోసం ఢిల్లీ వచ్చినప్పుడు హురియత్ నేతలతో చర్చలు జరుపుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వేర్పాటు వాదులతో చర్చలను తాము సమ్మతించబోమని తెలిపేందుకే భారత్ ఈ చర్యకు పాల్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Advertisement