పంచాయతీల చేతికి ఉపాధి నిధులు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను ఇకపై నేరుగా గ్రామ పంచాయతీలకే అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసకుంది. కేంద్రం మూడు దఫాలుగా ఉపాధి నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు అందించాల్సి ఉంది. అయితే, ఈ విధానంలో ఉపాధికూలీలకు సకాలంలో వేతనాలు లభించడం లేదని కేంద్రం అభిప్రాయపడింది. ఇకపై కేంద్రం నుంచి నేరుగా గ్రామపంచాయతీలకే నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది. […]
Advertisement
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను ఇకపై నేరుగా గ్రామ పంచాయతీలకే అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసకుంది. కేంద్రం మూడు దఫాలుగా ఉపాధి నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు అందించాల్సి ఉంది. అయితే, ఈ విధానంలో ఉపాధికూలీలకు సకాలంలో వేతనాలు లభించడం లేదని కేంద్రం అభిప్రాయపడింది. ఇకపై కేంద్రం నుంచి నేరుగా గ్రామపంచాయతీలకే నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇకపై ఉపాధి కూలీలకు వారంరోజుల్లోనే వేతనం లభించనుంది.
Advertisement