బెజవాడ కలెక్టర్ ఆఫీసుకు సీఎస్ కార్యాలయం తరలింపు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు క్యాంపు కార్యాలయాన్ని వెంటనే విజయవాడ తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విజయవాడలోని కలెక్టర్ క్యాంపు ఆఫీసుకు సీఎస్ కార్యాలయాన్ని తరలించాల్సిందిగా ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. దీంతో, విజయవాడ కలెక్టర్ క్యాంపు ఆఫీసు కోసం మరో భవనాన్ని సిద్ధం చేస్తున్నారు. విజయవాడలో సీఎం క్యాంపు ఆఫీసు కూడాసిద్ధమవుతుండడంతో సీఎస్ కార్యాలయాన్ని కూడా అక్కడకే తరలించాలని, అక్కడ నుంచే పనులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఇకపై ముఖ్యమంత్రి చంద్రబాబు […]
Advertisement
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు క్యాంపు కార్యాలయాన్ని వెంటనే విజయవాడ తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విజయవాడలోని కలెక్టర్ క్యాంపు ఆఫీసుకు సీఎస్ కార్యాలయాన్ని తరలించాల్సిందిగా ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. దీంతో, విజయవాడ కలెక్టర్ క్యాంపు ఆఫీసు కోసం మరో భవనాన్ని సిద్ధం చేస్తున్నారు. విజయవాడలో సీఎం క్యాంపు ఆఫీసు కూడాసిద్ధమవుతుండడంతో సీఎస్ కార్యాలయాన్ని కూడా అక్కడకే తరలించాలని, అక్కడ నుంచే పనులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఇకపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వారంలో నాలుగు రోజులు విజయవాడలోనే ఉంటారు. విజయవాడకు ఉద్యోగుల తరలింపు, వసతి గుర్తింపు కోసం ఏర్పాటైన జవహర్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి తన ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఉద్యోగుల కోసం 25 లక్షల చదరపు గజాల వసతి అవసరమని, ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్‌కు చెందిన ఏడు లక్షల చదరపు గజాల వసతి సిద్ధంగా ఉందని పేర్కొంది. విజయవాడలోని మేథాటవర్స్‌లో ఖాళీగా ఉన్న మూడు అంతస్తులను తీసుకోవాలని, ప్రైవేట్ భవనాలను తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని వెల్లడించింది.
Advertisement