జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత... జగన్ అరెస్ట్
ప్రత్యేక హోదాపై జగన్మోహనరెడ్డి మహాదీక్ష ముగిసిన అనంతరం జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ దీక్ష అనంతరం పార్లమెంటుకు మహా ధర్నా చేపట్టాలని భావించిన వైకాపా శ్రేణులకు పోలీసులు అడ్డు తగిలారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వైకాపా అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహా ధర్నాకు సిద్ధమైన జగన్‌తోపాటు వైకాపా నాయకులను, కార్యకర్తలను పోలీసులు ఎటూ కదలకుండా దిగ్బంధించారు. దాంతో వైకాపా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఫలితంగా […]
Advertisement
ప్రత్యేక హోదాపై జగన్మోహనరెడ్డి మహాదీక్ష ముగిసిన అనంతరం జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ దీక్ష అనంతరం పార్లమెంటుకు మహా ధర్నా చేపట్టాలని భావించిన వైకాపా శ్రేణులకు పోలీసులు అడ్డు తగిలారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వైకాపా అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహా ధర్నాకు సిద్ధమైన జగన్‌తోపాటు వైకాపా నాయకులను, కార్యకర్తలను పోలీసులు ఎటూ కదలకుండా దిగ్బంధించారు. దాంతో వైకాపా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఫలితంగా ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన లాఠీఛార్జిలో వైకాపా కార్యకర్తలు రక్తగాయాలకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో వైకాపా అధ్యక్షుడు జగన్మోహనరెడ్డితోపాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Advertisement