దిక్కుమాలిన స‌మ్మెలు " సీఎం 

రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను చూసి ఓర్వ లేక‌నే క‌మ్యూనిస్టులు, విప‌క్షాలు  కార్మికుల‌ను స‌మ్మెల‌కు ప్రేరిపిస్తున్నార‌ని, వారు చేస్తున్న‌వి దిక్కుమాలిన స‌మ్మెల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.  స‌చివాల‌యంలో మెర‌పు ధ‌ర్నాకు దిగిన నాయ‌కులు పోలీసులు అరెస్ట్ చేయ‌క ఏం చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. శ‌నివారం క‌రీంన‌గ‌ర్ లో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌హాస‌ముద్రంగండి వ‌ద్ద జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. ఈ స‌భ‌లో ఆయ‌న ప్ర‌తిప‌క్షాల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌ట్టారు. పోలీసులు అరెస్ట్ చేసి  ప్ర‌తిప‌క్షాలకు త‌గిన […]

Advertisement
Update:2015-08-08 18:35 IST
రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను చూసి ఓర్వ లేక‌నే క‌మ్యూనిస్టులు, విప‌క్షాలు కార్మికుల‌ను స‌మ్మెల‌కు ప్రేరిపిస్తున్నార‌ని, వారు చేస్తున్న‌వి దిక్కుమాలిన స‌మ్మెల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. స‌చివాల‌యంలో మెర‌పు ధ‌ర్నాకు దిగిన నాయ‌కులు పోలీసులు అరెస్ట్ చేయ‌క ఏం చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. శ‌నివారం క‌రీంన‌గ‌ర్ లో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌హాస‌ముద్రంగండి వ‌ద్ద జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. ఈ స‌భ‌లో ఆయ‌న ప్ర‌తిప‌క్షాల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌ట్టారు. పోలీసులు అరెస్ట్ చేసి ప్ర‌తిప‌క్షాలకు త‌గిన శాస్తి చేశార‌ని ఇప్ప‌టికైనా వారు బుద్ది తెచ్చుకోవాల‌ని కేసీఆర్ అన్నారు. తాను ద‌త్త‌త తీసుకున్న క‌రీంన‌గ‌ర్‌ను అద్దం లెక్క‌న స్వ‌చ్ఛంగా మారుస్తాన‌ని అందుకోసం అవ‌స‌ర‌మైతే పార‌, త‌ట్ట ప‌ట్టుకుని ప‌ని చేస్తాన‌ని అన్నారు.
Tags:    
Advertisement

Similar News