మంత్రి భార్యా? మజాకా!
భార్యల్లో మంత్రిగారి భార్యే వేరయా! అన్నట్టుంది చత్తీస్‌గఢ్ లో జరిగిన సంఘటన. చత్తీస్ గడ్ విద్యాశాఖా మంత్రి కేదార్ కాశ్యప్ భార్య బదులు ఇంకొక మహిళ పరీక్ష రాసేందుకు వచ్చి పట్టుబడింది. దీనిపై విపక్షాలు విద్యను అవుట్ సోర్సింగ్ ఇస్తున్న మంత్రి..తన భార్య రాయాల్సిన పరీక్షనూ అవుట్‌సోర్సింగ్‌కు ఇచ్చేశారని ఎద్దేవ చేస్తున్నాయి. ఎన్డీ టీవీ కథనం మేరకు విద్యాశాఖా మంత్రి కేదార్ కాశ్యప్ భార్య శాంతి కాశ్యప్ సుందర్‌లాల్ శర్మ ఓపెన్ యూరివర్శిటీలో దూరవిద్య ద్వారా ఇంగ్లీష్ […]
Advertisement
భార్యల్లో మంత్రిగారి భార్యే వేరయా! అన్నట్టుంది చత్తీస్‌గఢ్ లో జరిగిన సంఘటన. చత్తీస్ గడ్ విద్యాశాఖా మంత్రి కేదార్ కాశ్యప్ భార్య బదులు ఇంకొక మహిళ పరీక్ష రాసేందుకు వచ్చి పట్టుబడింది. దీనిపై విపక్షాలు విద్యను అవుట్ సోర్సింగ్ ఇస్తున్న మంత్రి..తన భార్య రాయాల్సిన పరీక్షనూ అవుట్‌సోర్సింగ్‌కు ఇచ్చేశారని ఎద్దేవ చేస్తున్నాయి. ఎన్డీ టీవీ కథనం మేరకు విద్యాశాఖా మంత్రి కేదార్ కాశ్యప్ భార్య శాంతి కాశ్యప్ సుందర్‌లాల్ శర్మ ఓపెన్ యూరివర్శిటీలో దూరవిద్య ద్వారా ఇంగ్లీష్ పీజీ కోర్సు చేస్తోంది. పీజీ పరీక్షల కోసం ఎగ్జామ్ హాల్‌కు మంత్రిభార్య వచ్చింది. అయితే విద్యార్థులు ఆమె మంత్రి భార్య శాంతి కాశ్యప్ కాదని ఎగ్జామ్ సెంటర్ ఇన్‌చార్జి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రిభార్య పరీక్ష రాసేందుకు వచ్చిన మహిళను అధికారులు విచారించారు. శాంతి కాశ్యప్ బదులు పరీక్ష రాసేందుకు వచ్చిన కిరణ్‌మౌర్య అనే మహిళ విద్యాశాఖా మంత్రి దగ్గరి బంధువని తేలింది. కిరణ్ మౌర్యను పరీక్ష హాలు నుంచి అధికారులు పంపేశారు.
Advertisement