జంషెడ్‌పూర్‌లో మతఘర్షణలు
ఒక ఈవ్ టీజింగ్ సంఘటన రెండు మతాల మధ్య ఘర్షణగా మారి జంషెడ్‌పూర్ రూపు రేఖల్ని మార్చివేసే పరిస్థితి తలెత్తింది. ఒక వర్గానికి చెందిన బాలికను మరో వర్గానికి చెందిన కొంతమంది అబ్బాయిలు వేధించడం జార్ఖండ్ రాజధాని జంషెడ్‌పూర్‌లో రెండు వర్గాల మధ్య మతఘర్షణలకు కారణమైంది. ఆందోళనకారులు ఈ ఘర్షణల్లో దుకాణాలను కొల్లగొట్టారు. వాహనాలను దగ్ధం చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నంలో నానా కష్టాలు పడాల్సి వచ్చింది. వాళ్ళపై రాళ్ళు […]
Advertisement
ఒక ఈవ్ టీజింగ్ సంఘటన రెండు మతాల మధ్య ఘర్షణగా మారి జంషెడ్‌పూర్ రూపు రేఖల్ని మార్చివేసే పరిస్థితి తలెత్తింది. ఒక వర్గానికి చెందిన బాలికను మరో వర్గానికి చెందిన కొంతమంది అబ్బాయిలు వేధించడం జార్ఖండ్ రాజధాని జంషెడ్‌పూర్‌లో రెండు వర్గాల మధ్య మతఘర్షణలకు కారణమైంది. ఆందోళనకారులు ఈ ఘర్షణల్లో దుకాణాలను కొల్లగొట్టారు. వాహనాలను దగ్ధం చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నంలో నానా కష్టాలు పడాల్సి వచ్చింది. వాళ్ళపై రాళ్ళు రువ్వుతూ రెచ్చగొట్టారు. దీంతో వందమందికి పైగా యువకులను అదుపులోకి తీసుకుని నగరంలో కర్ఫ్యూ విధించారు. పరిస్థితి కొంత కుదుటపడడంతో కర్ఫ్యూని నాలుగు గంటల పాటు సడలించారు. జంషెఢ్‌పూర్ నగరంలోని గాంధీ మైదానంలో ఓ బాలికను మరో వర్గానికి చెందిన బాలురు కలిసి వేధించారు. విషయం తెలుసుకున్న బాలిక వర్గం వారు వారితో గొడవకు దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. ఈ గొడవలతో అధికారులు కొల్షాన్ యూనివర్శిటీలో జరుగుతున్న పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది.
Advertisement