ఆ అధికారిని బాబు ఎందుకు పక్కనపెట్టాడు?

ఆయ‌న అత్యంత కీలకమైన అధికారి. సీఆర్‌డీఏ (కేపిట‌ల్ రీజియ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ అధారిటీ)లో ఆయ‌నే అత్యంత కీల‌కం. ఆయ‌న లేనిదే నిన్న‌టి వ‌ర‌కు ఏ ఫైలూ అడుగు ముందుకు ప‌డేది కాదు. ఆయ‌నే సీనియ‌ర్ ఐఎఎస్ అధికారి గిరిధ‌ర్‌. ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ కార్య‌ద‌ర్శి. కానీ విచిత్రంగా గిరిధ‌ర్  లేకుండానే ఏపీ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ విడుద‌ల‌య్యింది. ఆ కార్యక్రమానికి గిరిధ‌ర్ హాజరు కాక‌పోవ‌డంతో అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. సింగ‌పూర్ బృందం కూడా ఎప్పుడూ క‌నిపించే గిరిధ‌ర్ క‌నిపించ‌క‌పోయే […]

Advertisement
Update:2015-07-21 05:47 IST

ఆయ‌న అత్యంత కీలకమైన అధికారి. సీఆర్‌డీఏ (కేపిట‌ల్ రీజియ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ అధారిటీ)లో ఆయ‌నే అత్యంత కీల‌కం. ఆయ‌న లేనిదే నిన్న‌టి వ‌ర‌కు ఏ ఫైలూ అడుగు ముందుకు ప‌డేది కాదు. ఆయ‌నే సీనియ‌ర్ ఐఎఎస్ అధికారి గిరిధ‌ర్‌. ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ కార్య‌ద‌ర్శి. కానీ విచిత్రంగా గిరిధ‌ర్ లేకుండానే ఏపీ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ విడుద‌ల‌య్యింది. ఆ కార్యక్రమానికి గిరిధ‌ర్ హాజరు కాక‌పోవ‌డంతో అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. సింగ‌పూర్ బృందం కూడా ఎప్పుడూ క‌నిపించే గిరిధ‌ర్ క‌నిపించ‌క‌పోయే స‌రికి ఆశ్చ‌ర్య‌పోయిందట‌. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు గిరిధ‌ర్ కు విభేదాలు ఉండ‌డం వ‌ల్ల‌నే ఆయ‌న ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేద‌ని వినిపిస్తోంది. అంతేకాదు మున్సిపల్ మంత్రి నారాయ‌ణ‌కు గిరిధ‌ర్‌కు కూడా అస్స‌లు ప‌డ‌డం లేద‌ట‌. స్విస్ ఛాలెంజింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్న గిరిధర్ ను చంద్ర‌బాబు, నారాయ‌ణ చాలా న్యూన‌త‌కు గురి చేశార‌ని ఆ శాఖ వ‌ర్గాల‌లో తీవ్ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. ఇటీవ‌ల‌ చంద్రబాబు జపాన్ టూర్ కు కూడా గిరిధ‌ర్‌ను దూరంగా ఉంచారు. దాంతో ఈనెల 11 నుంచి గిరిధర్ సెల‌వుపై వెళ్లిపోయారు. అందుకే గిరిధ‌ర్‌ గైర్హాజరీలోనే రాజమండ్రిలో సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ విడుదలయ్యింది. తనను ఆ శాఖ నుంచి వేరే శాఖ‌కు బ‌దిలీ చేయాలని గిరిధర్ కోరుతున్నార‌ట‌. స్విస్ ఛాలెంజింగ్ విధాన‌మంటే చంద్ర‌బాబుకు ఎంతో ప్రీతి. ఎందుకంటే త‌మ‌కు న‌చ్చిన‌ కాంట్రాక్ట‌ర్ల‌కు ప‌నులు అప్ప‌గించేందుకు వెసులుబాటు క‌ల్పించే అద్భుత‌మైన ప‌ద్ధ‌తి ఇది. ప్ర‌భుత్వానికి, ప్ర‌జాధ‌నానికి గండి కొట్టే ఇలాంటి ప‌ద్ధ‌తిని గిరిధ‌ర్ వంటి వారు అడ్డుకోవాల‌ని చూడ‌డం స‌హ‌జ‌మే. అయితే రాజు త‌ల‌చుకుంటే కానిదేముంది? నిజాయితీ ప‌రుడైతే శంక‌ర‌గిరి మాన్యాలు ప‌ట్టిపోవ‌ల‌సిందే…

Tags:    
Advertisement

Similar News