వ్యాపం నిందితులపై బీజేపీ సస్పెన్షన్ వేటు

భోపాల్‌: వ్యాపం కుంభకోణంతో పీకలోతు కష్టాల్లో కూరుకుపోయిన బిజెపి దిద్దుబాటు చర్యల్ని చేపట్టింది. సిబిఐ తాజాగా వ్యాపం స్కాంతో సంబంధం ఉన్న బిజెపి నేత, మధ్యప్రదేశ్‌ వెనకబడిన తరగతుల కమిషన్‌ సభ్యుడు గులాబ్‌ సింగ్‌ కిరార్‌, అతని కుమారుడ్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. వారిద్దరి ప్రాధమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్లు బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నందకుమార్‌సింగ్‌ చౌహన్‌ తెలిపారు. ఎస్టిఎఫ్‌ పోలీసులు ఎనిమిది నెలల క్రితమే కిరార్‌, అతని కుమారునిపై కేసు నమోదు […]

Advertisement
Update:2015-07-17 19:02 IST
భోపాల్‌: వ్యాపం కుంభకోణంతో పీకలోతు కష్టాల్లో కూరుకుపోయిన బిజెపి దిద్దుబాటు చర్యల్ని చేపట్టింది. సిబిఐ తాజాగా వ్యాపం స్కాంతో సంబంధం ఉన్న బిజెపి నేత, మధ్యప్రదేశ్‌ వెనకబడిన తరగతుల కమిషన్‌ సభ్యుడు గులాబ్‌ సింగ్‌ కిరార్‌, అతని కుమారుడ్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. వారిద్దరి ప్రాధమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్లు బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నందకుమార్‌సింగ్‌ చౌహన్‌ తెలిపారు. ఎస్టిఎఫ్‌ పోలీసులు ఎనిమిది నెలల క్రితమే కిరార్‌, అతని కుమారునిపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్‌ గురువారం వ్యాపం స్కాంకు వ్యతిరేకంగా ఒక రోజు బంద్‌కు పిలుపునిచ్చి, సిఎం రాజీనామాకు డిమాండ్‌ చేసింది. సిబిఐ ఇప్పటి వరకు 8 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ప్రస్తుతం ఈ ఎనిమిది మందిలో ఇద్దరిని బీజేపీ సస్పెండ్ చేసింది.
Tags:    
Advertisement

Similar News