సంస్కరణల బిల్లుకు గ్రీస్ ప్రతిపక్షం మద్దతు
బెయిలవుట్ షరతుల ప్రకారం ప్రభుత్వం రూపొందించిన ఆర్థిక సంస్కరణల బిల్లును సొంత పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు వ్యతిరేకించినా ప్రతిపక్ష సభ్యులు మద్దతిచ్చారు. దీంతో గ్రీస్ పార్లమెంటులో ఆర్థిక సంస్కరణల బిల్లు ఆమోదముద్ర పొందింది. అధికార పార్టీ సిరిజాకు 149 మంది సభ్యులుండగా, వారిలో 32 మంది బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. అయితే, ప్రతిపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించడం అధికార పార్టీ మంత్రులు, ఎంపీల నిరసనల మధ్య బిల్లు పాసైంది. ఆరుగురు సభ్యులు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. కఠిన […]
Advertisement
బెయిలవుట్ షరతుల ప్రకారం ప్రభుత్వం రూపొందించిన ఆర్థిక సంస్కరణల బిల్లును సొంత పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు వ్యతిరేకించినా ప్రతిపక్ష సభ్యులు మద్దతిచ్చారు. దీంతో గ్రీస్ పార్లమెంటులో ఆర్థిక సంస్కరణల బిల్లు ఆమోదముద్ర పొందింది. అధికార పార్టీ సిరిజాకు 149 మంది సభ్యులుండగా, వారిలో 32 మంది బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. అయితే, ప్రతిపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించడం అధికార పార్టీ మంత్రులు, ఎంపీల నిరసనల మధ్య బిల్లు పాసైంది. ఆరుగురు సభ్యులు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. కఠిన షరతులకు సంబంధించి యూరోపియన్ యూనియన్ బ్యాంకింగ్ రూల్స్, మరికొన్ని బిల్లులకు గ్రీస్ పార్లమెంటు ఆమోదం తెలిపాల్సి ఉంటుంది.
Advertisement