ఏపీ, టీజీ మధ్య సర్వీస్‌ కమిషన్‌ సర్దుబాటు

ఉమ్మడి సర్వీస్‌ కమిషన్‌ భవనాల పంచాయితీ కొలిక్కి వచ్చింది. తాజా ఒప్పందం ప్రకారం సర్వీస్‌ కమిషన్‌లోని మొదటి అంతస్తు ఇరు రాష్ట్రాల కమిషన్లు ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం మొదటి అంతస్తు స్టోర్‌ రూమ్‌, రికార్డులు భద్రపర్చుకునేందుకు వాడుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా మొదటి అంతస్తు ఇరు రాష్ట్రాల కమిషన్లు ఉపయోగించుకోనున్నాయి. 2, 3 అంతస్తులు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు, 4, 5 అంతస్తులు ఏపీపీఎస్సీకి కేటాయించేలా అంగీకారం కుదిరింది. ప్రస్తుతం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో 4వ అంతస్తు వరకే […]

Advertisement
Update:2015-07-15 18:35 IST
ఉమ్మడి సర్వీస్‌ కమిషన్‌ భవనాల పంచాయితీ కొలిక్కి వచ్చింది. తాజా ఒప్పందం ప్రకారం సర్వీస్‌ కమిషన్‌లోని మొదటి అంతస్తు ఇరు రాష్ట్రాల కమిషన్లు ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం మొదటి అంతస్తు స్టోర్‌ రూమ్‌, రికార్డులు భద్రపర్చుకునేందుకు వాడుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా మొదటి అంతస్తు ఇరు రాష్ట్రాల కమిషన్లు ఉపయోగించుకోనున్నాయి. 2, 3 అంతస్తులు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు, 4, 5 అంతస్తులు ఏపీపీఎస్సీకి కేటాయించేలా అంగీకారం కుదిరింది. ప్రస్తుతం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో 4వ అంతస్తు వరకే లిఫ్టు ఉంది. 5వ అంతస్తు వరకు లిఫ్టును పొడగించేందుకు టీఎస్‌పీఎస్సీ అంగీకరించింది. సొంత నిధులతో టీఎస్‌పీఎస్సీ లిఫ్టు ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత లిఫ్టు నిర్వహ ణ వ్యయం మాత్రం ఇరు రాష్ట్రాల కమిషన్లు భరించాల్సి ఉంటుంది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి, ఏపీపీఎస్సీ ఇన్‌చార్జి చైర్మన్‌ శివనారాయణలు ఈ మేరకు ఒక అంగీకారానికి వచ్చారు. టీఎస్‌పీఎస్సీ తరపున సభ్యుడు విఠల్‌, ఏపీపీఎస్సీ నుంచి జి.చంద్రశేఖర్‌లు కలిసి పలు దఫాలుగా ఇరు రాష్ట్రాల సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత ఒప్పందం ఇరు సర్వీస్‌ కమిషన్ల చైర్మన్లు సంతకాలు చేశారు. ఒప్పంద పత్రాన్ని ఎవరికి వారు ఆయా ప్రభుత్వాలకు నివేదించారు. ఒప్పంద పత్రం మరో కాపీని గవర్నర్‌కు అందించారు.
Tags:    
Advertisement

Similar News