5 గంటలు.. 72 ప్రశ్నలు
ఓటుకు నోటు కుంభకోణం కేసులో అరెస్టైన ఎమ్మెల్యే సండ్రను ఏసీబీ విచారించిన తీరు ఇది! మొత్తంగా 5 గంటలు, దాదాపు 72 ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. అయితే, సండ్ర మాత్రం ప్రశ్నలన్నింటికి డొంక తిరుగుడు సమాధానాలు చెప్పినట్లు సమాచారం. మీరు సెబాస్టియన్ మాట్లాడుకున్న రికార్డులు మా దగ్గర ఉన్నాయనగానే సండ్ర 10 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయారట. మీ ఇద్దరి సంభాషణలో పదే పదే వాడిన సార్ అంటే ఎవరని ప్రశ్నించారు. జనార్దన్ అంటే ఎవరని? ఆయనకు […]
Advertisement
ఓటుకు నోటు కుంభకోణం కేసులో అరెస్టైన ఎమ్మెల్యే సండ్రను ఏసీబీ విచారించిన తీరు ఇది! మొత్తంగా 5 గంటలు, దాదాపు 72 ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. అయితే, సండ్ర మాత్రం ప్రశ్నలన్నింటికి డొంక తిరుగుడు సమాధానాలు చెప్పినట్లు సమాచారం. మీరు సెబాస్టియన్ మాట్లాడుకున్న రికార్డులు మా దగ్గర ఉన్నాయనగానే సండ్ర 10 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయారట. మీ ఇద్దరి సంభాషణలో పదే పదే వాడిన సార్ అంటే ఎవరని ప్రశ్నించారు. జనార్దన్ అంటే ఎవరని? ఆయనకు ఈ కేసుతో సంబంధం ఏంటని? ప‌్రశ్నల వర్షం కురిపించారు. ఏసీబీ అడిగిన అన్ని ప్రశ్నలకు సండ్ర సమాధానాలు దాటవేయడంతో పోలీసులు తమదైన శైలిలో వ్యవహరించారు. ఆయన ఎదుటకు సెబాస్టియన్‌ను తీసుకువచ్చి కూర్చుండబెట్టారు. వూహించని ఈ పరిణామంతో సండ్ర అవాక్కయ్యారు. ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చుండబెట్టి ప్రశ్నలు అడిగారు. తన ఫోన్‌నుంచి సండ్రకు కాల్ చేసింది నిజమేనని తమ ఎదుట సెబాస్టియన్ ఒప్పుకున్నట్టు ఏసీబీలోని ఓ కీలకఅధికారి వెల్లడించారు. ఈ విషయం సెబాస్టియన్ చెప్పగానే సండ్ర ఉక్కిరిబిక్కిరయ్యారని ఆయన తెలిపారు. సండ్ర విచారణలో ఏం విషయాలు వెల్లడించారోనని, ఇంకా ఎవరి పేర్లు బయటికి వస్తాయోనని టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది.
Advertisement